ఈ న్యూ ఇయర్‌కు మీ ఫ్రెండ్ లేదా బంధువులకు ఏం బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? అయితే, మిమ్మల్ని ఏడాది మొత్తం గుర్తించుకోగల గిఫ్టునే ఇవ్వండి. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో జీయో ప్రకటించిన ఈ కొత్త ప్లాన్.. తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అన్‌లిమెటెడ్ డేటా కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఇది భలే ఛాన్స్. ఈ ఏడాది రొటీన్ గిఫ్టులను కాకుండా పనికొచ్చేవి ఇవ్వాలి అనుకొనేవారికి ఇదే మంచి ఆప్షన్. అంతేకాదు.. ఏడాదిపాటు రీఛార్జ్‌లు చేసుకొనే అవసరం కూడా ఉండదు. ఇంతకీ JIO ప్రకటించిన ఆ కొత్త ప్లాన్ ఏంటీ? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటీ తదితర వివరాలను చూద్దాం.
12 నెలల వ్యాలిడిటీతో అపరిమిత 5G డేటా
JIO తమ వినియోగదారుల కోసం కొత్తగా 12 నెలల వ్యాలిడిటీతో అపరిమిత 5G డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అతిగా డేటా ఉపయోగించేవారికి ఇది కత్తిలాంటి ప్లాన్. ఏడాది పాటు మళ్లీ మళ్లీ రీఛార్జ్ అవసరం లేకుండా.. అన్‌లిమెటెడ్‌గా డేటాను వాడేసుకోవచ్చు. ఇందుకు మీరు రూ.601 చెల్లిస్తే చాలు.
ఈ షరతులు వర్తిస్తాయి
అయితే, ప్లాన్‌లో ఒక ట్విస్టు ఉంది. రూ.601 చెల్లిస్తే కేవలం మీకు అన్‌లిమిటెడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ముఖ్యంగా మీరు ప్రీ పెయిడ్ వినియోగదారులైతే ప్రతి నెల రీచార్జ్ చేయించుకోవల్సిందే. రోజుకు 2GB లేదా 4GB డేటా రీఛార్జ్ ప్లాన్‌తో ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు 12 నెలల పాటు అపరిమిత 5G డేటాను పొందగలరు. అయితే మీరు రోజుకు 1GB డేటా లేదా రూ.1,899 ప్లాన్ వినియోగదారులైతే మాత్రం.. ఈ ప్లాన్ పనికిరాదు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఇలా రీఛార్జ్ చేసుకోండి
మీరు ఈ 5G ప్లాన్‌ను మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు బహుమతిగా ఇవ్వాలని భావిస్తే, మీరు మై జియో (MyJio) యాప్ ద్వారా 12 అపరిమిత 5G వోచర్లను తీసుకోవల్సి ఉంటుంది. ఈ వోచర్లు Google Play Store లేదా Apple App Storeలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు, ఈ వోచర్లను జియో అనలిమిటెడ్ 5G ప్లాన్‌లో యాక్టివేట్ చేయడానికి, వారి ప్రాథమిక నెలవారీ లేదా మూడు నెలల బేస్ ప్లాన్‌ను ఎంచుకోవాలి.
ఈ వోచర్లను అందించవచ్చు
వినియోగదారుల కోసం జియో కొన్ని వోచర్లను కూడా అందుబాటులో ఉంచింది. 5G ప్లాన్‌లో వోచర్‌లను ఎంచుకోగలిగే రీఛార్జ్ ప్లాన్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ₹199, ₹239, ₹299, ₹319, ₹329, ₹579, ₹666, ₹769, ₹899 వంటి వివిధ ధరల రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వోచర్‌లు 30 రోజులు లేదా బేస్ ప్లాన్ గరిష్ట వాలిడిటీని కలిగి ఉంటాయి.
ఈ ప్లాన్ ఎవరికి ఉపయోగకరం
ఎక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. హై-స్పీడ్ 5G ఇంటర్నెట్ అవసరమైన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే వారైతే.. వారికి ఈ ప్లాన్‌ను బహుమతిగా ఇవ్వడం నిజంగా విలువైనది అవుతుంది. సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యేందుకు, రీల్స్, వీడియోలు స్ట్రీమ్ చేయడానికి లేదా ఇతర ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడానికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎలా కొనుగోలు చేయాలి?
ఈ ప్రత్యేక 5G ప్లాన్‌ను కొనుగోలు చేయడం చాలా సులభం. మీరు మై జియో (MyJio) యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసి, మీ అకౌంట్‌లో లాగిన్ అయ్యాక, మీరు జియో 5G వోచర్‌ను కొనుగోలు చేసి, మీ స్నేహితులకి బహుమతిగా పంపవచ్చు.