పన్ను చెల్లింపుదారులకు ఊరట! ఈసారి బడ్జెట్‌లో మార్పులు ఖాయం!

Income taxpayers

పన్ను భారం నుంచి బయటపడేయాలంటూ వేతన జీవులు ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు. ఏదో చిన్న చిన్న మార్పులతో సంతృప్తి పరుస్తున్న మోదీ ప్రభుత్వం పన్నుచెల్లింపుదారుల కొరికను మాత్రం తీర్చడంలేదు. బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారీ ఆశపడటం బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందడం అలవాటు అయిపోయింది. అయితే ఈసారి మాత్రం అలాంటి గుడ్ న్యూస్ ఉంటుందని పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట ఇచ్చే ఛాన్స్ ఉంది. […]

జనవరి నుంచి దేశంలో వచ్చే అతి పెద్ద మార్పులు ఇవే- వీటిని తెలుసుకోకుంటే మాత్రం జేబులు చిల్లే

January 2025

జనవరి 1 కొత్త సంవత్సరం ప్రారంభోత్సవంతోనే దేశంలో ఆర్థిక మార్పులు జరగనున్నాయి. వాటిలో కొన్ని భారాన్ని పెంచేవి అయితే మరికొన్ని ప్రయోజనకరంగా ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అదే టైంలో కొత్తగా వచ్చే మార్పులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే కచ్చితంగా మీరు ఆర్థికంగా నష్ట పోతారు. దేశంలో ప్రతి నెల అనేక ఆర్థిక మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొత్త సంవత్సంలో కూడా ప్రధానంగా ఐదు మార్పులు కనిపించనున్నాయి. […]

Jio new year plan: జియో అదిపోయే గిఫ్ట్.. అతి తక్కువ ధరకే ఏడాది మొత్తం అన్‌లిమిటెడ్ 5G

Image Credit: Pixabay

ఈ న్యూ ఇయర్‌కు మీ ఫ్రెండ్ లేదా బంధువులకు ఏం బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? అయితే, మిమ్మల్ని ఏడాది మొత్తం గుర్తించుకోగల గిఫ్టునే ఇవ్వండి. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో జీయో ప్రకటించిన ఈ కొత్త ప్లాన్.. తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అన్‌లిమెటెడ్ డేటా కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఇది భలే ఛాన్స్. ఈ ఏడాది రొటీన్ గిఫ్టులను కాకుండా పనికొచ్చేవి ఇవ్వాలి అనుకొనేవారికి ఇదే మంచి ఆప్షన్. అంతేకాదు.. ఏడాదిపాటు రీఛార్జ్‌లు చేసుకొనే […]

PMAY 2.0: PM ఆవాస్ యోజన కింద కొత్త ఇంటి కోసం ఎలా దరఖాస్తు చేయాలి? స్టెప్‌ బై స్టెప్‌ ప్రక్రియను తెలుసుకోండి

PMAY 2.0

పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులతోపాటు మధ్య తరగతి కుటుంబాలకు సహాయం చేయడానికి ఈ పీఎంఏవై 2.0 పథకాన్ని రూపొందించారు. దీన్ని ఆగస్ట్ 9, 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం ప్రకారం కొత్తగా కోటి ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఒక్కో ఇంటికి రెండున్నర లక్షల రూపాయలు రాయితీ ఇస్తోంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PM ఆవాస్ యోజన 2.0) కింద లబ్ధి పొందాలనుకునే వారి కోసం దీన్ని […]

Sania Mirza: విద్యార్థి దశ నుంచే సమానత్వ మనస్తత్వాన్ని పెంపొందించాలి- క్లీన్ ఈక్వల్ మిషన్‌ను పరిచయ కార్యక్రమంలో సానియా మీర్జా

sania mirza

భారతదేశంలో విశ్వసనీయ గృహ పరిశుభ్రత బ్రాండ్, వేపతో తయారైన ఐటీసీ నిమైల్ తన క్లీన్ ఈక్వల్ మిషన్ ద్వారా మరింత బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు ఒక స్పృహతో ముందడుగు వేసింది. చాలా ఇళ్లలో ఇంటి పనులను, ముఖ్యంగా శుభ్రపరిచే ప్రాథమిక బాధ్యతను మహిళలు తీసుకుంటారు. ఆ పని వారే చేయాలని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. ఈ విషయంలో స్త్రీపురుష బేధం లేదని చెప్పి అందరికీ బాధ్యత ఉందని భావి తరాలకు అవగాహన పెంచడం ముఖ్యం. దీన్ని […]

Bulgari: మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేతికి క్రెడిట్‌ కార్డు లాంటి నాజూకైన వాచ్‌- ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు!

Octo Finissimo Ultra SOSC

రెండు క్రెడిట్ కార్డులు ఒకదానిపై ఒకటి పెడితే ఎంత మందం కలిగి ఉంటాయో అంతే నాజూకుగా ఉండే సరికొత్త వాచ్ మార్కెట్‌లోకి వచ్చింది. దీన్ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ధరించారు. దీంతో ఈ వాచ్‌ ఇప్పుడు హై ప్రొఫైల్‌ సొసైటీలో డిస్కషన్ పాయింట్ అయింది. లగ్జరీ ఉత్పత్తుల తయారు చేసే ఇటాలియన్ సంస్థ బల్గారీ దీన్ని తయారు చేసింది. దీని పేరు ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా SOSC. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ చేతిలో […]

Andhra Pradesh: క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ- రెండు ప్రాజెక్టు పెట్టనున్న SAEL సోలార్‌ కంపెనీ

Gottipati Ravi Kumar

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ విదేశాల్లో ఉన్న పెట్టుబడుదారులు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నార్వే, బ్రిక్స్ దేశాలకు చెందిన మార్క్యూ పెట్టుబడిదారులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌తో సమావేశమయ్యారు. గొట్టిపాటి రవికుమార్‌తో పెట్టుబడుదారులు సమావేశం  గొట్టిపాటి రవి కుమార్‌తో సమావేశమైన వారిలో […]

ఇలా చేస్తే మీరే “లక్కీ భాస్కర్‌”- ఎంత అప్పుల్లో ఉన్న బయటపడొచ్చు

Lucky Bhaskar Life Lessons

Lucky Bhaskar: లక్కీ భాస్కర్ ఈ మధ్య కాలంలో ప్రజలకు బాగా కనెక్ట్ అయిన సినిమా. అందులో కొన్ని సన్నివేశాలు ఓవర్‌ ద లైఫ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం కట్టిపడేశాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమను ఆ సినిమాలో చూసుకున్నారు. జీవితంలో సెటిల్ అయిన వాళ్లు పడిన కష్టనష్టాలు, చీత్కారాలు, చీవాట్లు, విమర్శలు ఇలా అన్నీ వారి మైండ్‌లో ఒక్కసారిగా తెరపై కనిపించి ఉంటాయి. తామే అందులో నటించామా అన్న భావనలో ఉన్నవాళ్లు లేకపోలేదు. లక్కీ […]

PAN Card Rules: బ్యాంకులో క్యాష్ డిపాజిట్లకు పాన్ కార్డు అవసరమా? అది లేకుండా భారీ డిపాజిట్లు చెయ్యడం ఎలా?

Image Credit: Social Media

బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లకు చాలా రూల్స్ ఉంటాయి. అయితే వాటిని అర్థం చేసుకోవడం చాలా గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా పాన్ కార్డ్ గురించి. చాలా మంది ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం పాన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, అనేక బ్యాంకింగ్ లావాదేవీలకు సైతం పాన్ చాలా ముఖ్యమనే సంగతి కొందరికి తెలీదు. ముఖ్యంగా క్యాష్ డిపాజిట్స్ సమయంలో పాన్ కార్డు తప్పకుండా అవసరమా? అసలు బ్యాకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి? తదితర విషయాలు మీ కోసం. పాన్ కార్డ్ అంటే? […]

ఐదు నెలల్లో మీ ఫైనాన్సియల్ స్టేటస్ సెట్ చేసే టెక్నిక్- రాకేష్‌లా మీరూ మారండి

రాకేష్‌, శిరీష ఇద్దరు ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నారు. రాకేష్ టీం లీడ్‌, శిరీష ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎంప్లాయి. రాకేష్‌ జీతం యాభైవేలకుపైనే ఉంటుంది. అందులోనూ బ్యాచిలర్‌. శిరీషకు ఏడాది క్రితం పెళ్లై. ఆమె శాలరీ 20 వేలే. ఆమె భర్త కూడా ఉద్యోగే. ఆయన శాలరీ కూడా దాదాపు పాతికవేలు ఉంటుంది. అయితే నెలాఖరుకు వచ్చేసరికి రాకేష్ జేబు ఖాళీ అవుతుంది. డబ్బులు అవసరం అయితే శిరీషను అడుగుతుంటాడు. మళ్లీ శాలరీ వచ్చిన వెంటనే ఇచ్చేస్తుంటాడు. […]