CM Revanth Reddy: శ్రీరామనవమి వేడుక.. సన్నబియ్యం లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి భోజనం..!

ఇవాళ శ్రీరామనవమి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. అక్కడ సీతారాముల కళ్యాణ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సారపాక గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు సన్న బియ్యం లబ్ధిదారుడు బోరం శ్రీనివాస్ ఇంట్లో సీఎం భోజనం […]

Pithapuram: నాగబాబు పర్యటనలో ఉద్రిక్తత.. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన!

పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నాగబాబు పర్యటనతో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరు పార్టీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఒక్కసారిగా పిఠాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఆదిపత్య పోరు పీక్స్ కు చేరింది. టిడిపి vs జనసేన మధ్య ఫైట్ బాగా ముదిరింది. అందుకు కారణం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అని తెలుస్తోంది. ఇవాళ పిఠాపురంలోని కుమారపురం గ్రామంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. ఆ గ్రామంలోని సిసి రోడ్డును […]

Alekhya Chitti pickles: స్పైసీ సక్సెస్ నుంచి సోషల్ మీడియా స్పైస్ వరకు – ట్రోలింగ్ ఒక వ్యాపారాన్ని ఎలా దెబ్బతీసింది

alekhya chitti pickles controversy

అలేఖ్య చిట్టి పికిల్స్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ప్రారంభమైంది. అక్కడ ముగ్గురు సిస్టర్స్‌ అలేఖ్య, చిట్టి, రమ్య సోషల్ మీడియాలో రీల్స్‌ చేస్తూ ఫేమస్ అయ్యారు. కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ పికిల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. రొయ్యలు, చేపల పికిల్స్ వంటి మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు నమ్మకమైన కస్టమర్ బేస్‌ను నిర్మించడానికి వారి సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించుకున్నారు. 2025 ఏప్రిల్ ప్రారంభంలో ఒక కస్టమర్ వాట్సాప్ ద్వారా కిలో రొయ్యల పచ్చడి […]

HCU Land Dispute: తెలంగాణలో 400 ఎకరాల కోసం గళమెత్తిన కోట్ల గొంతుకలు- ప్రభుత్వ చర్యలను ఆడ్డుకున్న కోర్టులు, ఎప్పుడు ఏం జరిగిందో పూర్తి వివరాలు చూద్దాం

HCU Land Dispute

HCU Land Dispute: తెలంగాణలో అధికారికంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంగా పిలిచే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU), కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాలు భూ వివాదానికి కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ద్వారా, పారిశ్రామిక అభివృద్ధి కోసం, ప్రధానంగా ఐటీ పార్క్ కోసం, రూ. 10,000 కోట్ల మూల ధరతో భూమిని వేలం వేయాలని నిర్ణయించినప్పుడు ఈ వివాదం చెలరేగింది. ఈ భూమి విశ్వవిద్యాలయానికి చెందినదని, ఇది ఒక ముఖ్యమైన […]

Anchor Vishnu Priya: హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !

Anchor Vishnu Priya

Anchor Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిలో.. ఇప్పుడు బెదురు మొదలైంది. వరుసగా నమోదవుతున్న కేసులు.. ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తున్నాయ్. ఈ లిస్టులోకి ఇప్పుడు హీరో రానా, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా చేరిపోయారు. సెలబ్రిటీలు, యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు అనే తేడా లేకుండా 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంతో.. నెక్ట్స్ ఏం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది. ఏమాత్రం ఆలోచించకుండా, తమనెవరు అడుగుతారులే అని బెట్టింగ్ […]

Sunita Williams Return: సురక్షితంగా దివి నుంచి భువికి చేరిన సునీతా విలియమ్స్‌- టీంకు రక్షణగా తిమింగలాలు

Sunita Williams Return

ప్రపంచమంతా కన్నార్పకుండా చూసిన క్షణం…. అంతరిక్షంలో 17 గంటల క్రితం బయల్దేరిన డ్రాగన్ క్యాప్సూల్‌ నుంచి ప్యారాచూట్స్ విచ్చుకుంటున్న దృశ్యం… కోట్ల మంది ప్రార్థనల ఫలితం… సునీత సురక్షితంగా తల్లి ఒడికి చేరారు. తొమ్మిది నెలల అంతరిక్షవాసం ముగించుకున్న సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. నాసా, స్పేస్ ఎక్స్ పంపించిన డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ ‌హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి […]

సునీతా విలియమ్స్‌ ఎన్నిరోజులు అంతరిక్షంలో ఉన్నారు? జీతం ఎంత వస్తుంది? ఆరోగ్యం ఏమవుతుంది?

sunita williams

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న సునీత విలియమ్స్‌, విల్‌మోర్‌ను మరికొన్ని గంటల్లో భూమిపైకి తిరిగిరానున్నారు.వారిని తీసుకొచ్చందుకు స్పేస్ ఎక్స్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములకు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తో టీం ఘన స్వాగతం పలికారు. 9 నెలలుగా అంతరిక్ష వాసం కొన్ని గంటల్లో ముగిసిపోనుంది. అయితే అంతకంటే ముందు అక్కడి బాధ్యతలను కొత్త టీంకు అప్పగించాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. అయితే ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాతావరణం అనుకూలిస్తే తిరుగుపయనం […]

సజ్జల రామకృష్ణలా మారుతున్న నాగబాబు! ఏపీలో ఇదే కొత్త టాపిక్‌!

nagababu

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మూడు పార్టీలో ఒకటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. కూటమి పార్టీల్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు టీడీపీకి పడటం లేదని టాగ్ గట్టిగా వినిపిస్తోంది. అందుకు తగట్టుగానే ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనానీ యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. అప్పట్లో ఓసారి కేబినెట్ భేటీకి కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఆరోగ్యం బాగాలేదని […]

కేజ్రీవాల్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ – గెలిచింది బీజేపీ – ఢిల్లీలో జరిగింది ఇదే !

కేజ్రీవాల్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ - గెలిచింది బీజేపీ - ఢిల్లీలో జరిగింది ఇదే !

Keiriwal:  ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పడం కన్నా..  ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ ఓడించింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.  పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసే బీజేపీ.. అసెంబ్లీకి వచ్చే సరికి కేజ్రీవాల్ ముందు ఎప్పుడూ తల వంచాల్సి వచ్చేది. కానీ ఈ సారి మాత్రం పదకొండేళ్ల  పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలతో గడ్డు పరిస్థితి ఎదురవుతుందని తెలిసినా.. మిత్రుల్ని కలుపుకుని పోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. […]

Delhi Assembly Elections 2025: ఇది ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి కాదు- రాజకీయల నుంచి సామాన్యుడి నిష్క్రమణ

Kejriwal

Delhi Assembly Elections 2025: అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశ యువతను ఏక  తాటి పైకి తీసుకొచ్చి నాటి యూపీ ప్రభుత్వానికి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేజ్రీవాల్ అదే అవినీతి  మరకతో  పోరాటం చేసిన ప్రాంతంలోనే ఓటమి పాలయ్యారు.  రాజకీయాల్లో    ధన బలం, కండ బలం ఉంటేనే రాణించగలమని అప్పటి వరకు   నడుస్తున్నట్రెండ్‌ను బ్రేక్ చేసి ఓ సామాన్యుడు కూడా రాజకీయం చేయగలడని నిరూపించారు కేజ్రీవాల్. గుండె ధైర్యం ఉంటే చాలని  ప్రూవ్ చేశారు. అప్పటికే […]