బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్. పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి స్టార్డమ్ అందుకున్నాడు. అలా తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాాడు. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాపకు జన్మనిచ్చారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూతురు పేరు ఆరాధ్య బచ్చన్.
ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో సుపరిచితమే. అంతేేేకాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటి కప్పుడు ఫొటోలు పెడుతూ నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ 13 ఏళ్ల ఆరాధ్య కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్నతనంలో కోర్టు మెట్లు ఎక్కడానికి గల కారణాలు ఏంటా? అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే దానికి ఓ బలమైన కారణం ఉంది.
గతంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ ఆరాధ్య ఆరోగ్యంపై ఫేక్ వార్తలు క్రియేట్ చేసి వాటిని ప్రసారం చేశాయి. ఆమెకు హెల్త్ బాలేదని.. కోలుకోలేకపోతున్నారని నెట్టింట జోరుగా ప్రసారం చేశాయి. అక్కడితో ఆగకుండా ‘ఆరాధ్య ఇకలేరు’ అనే టైటిల్తో వీడియోలు పబ్లిష్ చేశారు. దీంతో ఈ విషయంపై అభిషేక్ బచ్చన్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆరాధ్య ఆరోగ్యం గురించి నకిలీ వీడియోలను తొలగించాలని హైకోర్టు 2023లో యూట్యూబ్‌లను ఆదేశించింది. అలా చేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. దీంతో కోర్టు వ్యాఖ్యలకు వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేసినట్టే చేసి మళ్లీ అవే వార్తలను కంటిన్యూ చేశాయి. మళ్లీ ఆరాధ్యకు సంబంధించిన వార్తలు నెట్టింట జోరుగా సాగాయి ఈ సారి అభిషేక్ బచ్చన్ కాకుండా.. ఆయన కూతురు ఆరాధ్య కోర్టు మెట్లు ఎక్కింది. స్వయంగా తానేే కోర్టులో పిటిషన్ వేసింది.
దీంతో ఆరాధ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గూగుల్‌కి నోటీసులు ఇచ్చింది. సెలబ్రిటీ అయినా, మానసిక ఆరోగ్యం విషయానికొస్తే ప్రతీ వ్యక్తి గౌరవంగా ఉండే హక్కు ఉందని కోర్టు తెలిపింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా సంస్థలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసును మార్చి 17కి వాయిదా వేసింది.