నాచురల్ స్టార్ నాని అండ్ శైలేష్ కొలను కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హిట్ 3. ఈ సినిమాపై ఎనలేని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయగా దూసుకుపోయింది. అభిమానులకు అవసరమైన మాస్ యాక్షన్ అందిస్తూ నాని లుక్ ఉండడంతో ఫుల్ కుష్ అయ్యారు.
నాని తన కెరీర్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. దీంతో మరింత హైప్ నెలకొంది. ఈ టీజర్ లో నాని ఊర మాస్ లుక్, మాస్ డైలాగ్, యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ఇటీవలే నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి మధ్య వచ్చే ఒక మెలోడీ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ల జోడి అందర్నీ అట్రాక్ట్ చేసింది.
ఇక ఇప్పుడు మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. ఈ మూవీ నుంచి తాజాగా నాని క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఇందులో భాగంగా అబ్ కి బార్ అర్జున్ సర్కార్ అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మోస్ట్ పవర్ఫుల్ గా ఉంది. ఇందులో నాని వైలెంట్ గా కనిపించాడు. వేటు వేసినా.. గీత రాసినా కోతమారునా అంటే ఈ సాంగ్ సాగుతుంది.
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ సాంగ్ ను అనురాగ కులకర్ణి పాడారు. ఇక ఈ సాంగ్ తో పాటు మేకర్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14న అంటే అంబేద్కర్ జయంతి రోజు ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చూడాల మరి ట్రైలర్ తో ఎలాంటి అంచనాలు అందుకుంటారో.