Prabhas: ప్రముఖ వ్యాపార వేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి! క్లారిటీ ఇచ్చేశారు

Prabhas

Prabhas: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై గత కొన్ని రోజులగా జోరుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన బిజినెస్‌మాన్ కుమార్తెతో ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని.. అతి త్వరలోనే పెళ్లి జరుగుతుందంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికితోడు రామ్ చరణ్ అన్ స్టాపుల్ షోలో చేసిన కామెంట్స్ కూడా సింక్ చేసేశారు.

అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. గణపవరంకి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకుంటున్నాడని.. ఏపీకి చెందిన ఈ అమ్మాయి ఫ్యామిలీ తెలంగాణలో సెటిల్ అయిందని.. ఇరువురి కుటుంబాలు కూడా మాట్లాడుకుంటున్నారని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ టీమ్ స్పందించింది.

ప్రభాస్ మ్యారేజ్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే.. తామే స్వయంగా ప్రకటిస్తామని.. పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. కొందరు మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రభాస్ టీమ్ వివరణ అడగగా.. ఇలా క్లారిటీ ఇచ్చేశారు. అప్పట్లో ప్రభాస్ కు కృతిసనన్‌తో పెళ్లి జరగబోతోంది అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. దీనిపై వీరిద్దరు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక తాజాగా ఓ బిజినెస్ మాన్ కుమార్తెతో వివాహం జరగబోతోంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ప్రభాస్ వయసు 45 సంవత్సరాలు. ఇంకా బ్యాచలర్‌గానే ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ మూవీస్ తో బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించనున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలను కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు ప్రభాస్ ‘కన్నప్ప’చిత్రంతో తన అభిమానులను ఆశ్చర్య పరచబోతున్నాడు. ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న ఈ మూవీలో ప్రభాస్ రుద్రుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం