Kannappa: ట్రోల్స్ చేస్తే శివుడి శాపం తప్పదు: కన్నప్ప మూవీ నటుడు సంచలన కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మంచు విష్ణు తో పాటు మరి ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఇందులో భాగమయ్యారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి సీనియర్ అండ్ యంగ్ నటినటులు ఇందులో భాగమయ్యారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, సాంగ్స్, టీజర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా అంచనాలు పెంచేస్తున్నారు.

ఈ తరుణంలోనే మంచు విష్ణు అండ్ టీం రీసెంట్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర విషయాలను మంచు విష్ణు పంచుకున్నారు. ఆయనతోపాటు నటుడు బ్రహ్మాజీ, రఘు బాబు పాల్గొన్నారు. సరదాగా మీడియా మిత్రులతో మాట్లాడారు. అదే సమయంలో రఘుబాబు చేసిన కామెంట్స్ నెట్టింట దుమ్మారం రేపుతున్నాయి.

కన్నప్ప సినిమాను ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళు శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు కన్నప్ప సినిమాపై వస్తున్న ట్రోల్స్ పై రఘుబాబు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే శివుని శాపానికి గురవడం ఖాయం అన్నారు. ఇది 100కు 100% నిజమని.. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ట్రోల్ చేస్తే ఫినిష్ అయిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టెంటా వైరల్ గా మారాయి. అయితే అతడు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి ఎన్నో ట్రోల్స్, విమర్శలకు గురైన విషయం తెలిసిందే. కన్నప్ప సినిమా నుంచి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

తరచూ ఏదో ఒక విషయంపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. వీటిపై గతంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ఇలాంటి ట్రోల్స్ను తాను పట్టించుకోనని తెలిపాడు. ఇప్పుడు మరోసారి వాటిపై నటుడు రఘు బాబు స్పందిస్తూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు.

తరవాత కథనం