Actress Abhinaya: ప్రియుడితో ‘అభినయ’ పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్‌

abhinaya-engagement

Actress Abhinaya: నటి అభినయ గురించి మనందరికి తెలిసిందే. పుట్టుకతో మూగ, చెవిటి అయిన తన అభినయ ప్రతిభతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. తమిళనాడు నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ రవితేజ నేనింతే మూవీతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. తొలి సినిమాలో చిన్న రోల్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ శంభో శివ శంభోలో మరోసారి రవితేజతో నటించి ఒక్కసారిగా ఫేమస్ అయింది. అంతే కాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లో చెట్టులో మహేష్ బాబు, వెంకటేష్‌ల చెల్లెలుగా నటించి అందరి మనసులు గెలిచింది. కింగ్, దమ్మూ, ధృవ, సీతారామం వంటి పలు సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది.

తమిళ , కన్నడ సినిమాల్లో కూడా బిజీగా నటిస్తూ.. మార్క్ ఆంటోనీ లాంటి డబ్బింగ్ సినిమాల్లో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక అభినయ తా కారణంతో వార్తల్లో నిలిచింది. ఇక అభినయ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఏంటంటే అభినయ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. తన కాబోయో భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. త్వరలో తానూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నానని కాబోయో భర్తతో కలిసి గుడిగంట కొడుతున్న ఫోటోను అభినయ పంచుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 9న తమకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. ఆమె ఫోటోలు షేర్ చేసింది.

అతని పేరు సన్నీ వర్మ అని తెలిపింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపింది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల ఎలక్ట్రికల్, మైనింగ్ రైల్వే నిర్మాణంలో అంతర్జాతీయ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను తొలిసారి రివీల్ చేసింది. తన చిన్ననాటి ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నాను.. 15 ఏళ్లుగా తమ ఇద్దరి మధ్య బందం ఉందని.. త్వరలో అతని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది.

 

తరవాత కథనం