హీరోయిన్ అభినయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రియల్ లైఫ్ లో ఆమె మూగ, చెవిటి అమ్మాయి. అయినప్పటికీ సినిమాల్లోకొస్తే అందమైన హీరోయిన్. తన అమాయకత్వం ముఖంతో ఎంతోమంది సినీ ప్రియులును ఆకట్టుకున్న అందమైన బ్యూటీ అభినయ. ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డమరుకం, శంభో శివ శంభో వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, నటన పరంగా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఇక కోలీవుడ్లో సైతం ఆమె ఒక స్టార్ హీరోయిన్. పలుస్టార్ల సరసన నటించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది.
టాలెంట్ ఎవడు సొత్తు కాదని నిరూపించింది. మాట్లాడలేకపోయినా, వినపడకపోయినా తన టాలెంట్ తో ముందుకు నెట్టుకొస్తుంది. స్టార్ హీరోయిన్లకు తగ్గ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా మలయాళంలో విడుదలైన ఓ సినిమాతో మరింత స్థాయికి ఎదిగింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో అభినయ పెళ్లికి సంబంధించి ఎన్నో గాసిప్స్ చెక్కర్లు కొట్టాయి.
కోలీవుడ్ హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు.. గత కొంతకాలంగా వీరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు జోరుగా సాగాయి. అయితే అవన్నీ అవాస్తవమని విశాల్, అభినయ వేరు వేరు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను 15 ఏళ్ల నుంచి వేరొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని అభినయ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా వారికి సంబంధించి రూమర్స్ ఆగలేదు.
వాటికి చెక్ పెడుతూ అభినయ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. తాజాగా ఆమె తనకు కాబోయే భర్తతో కలిసి గుడి గంటను మోగించింది. తన చేయితో పాటు.. తనకు కాబోయే భర్త చేయితో ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
మమ్మల్ని మీ మంచి మనసుతో ఆశీర్వదించండి.. కొత్త జీవితం మొదలుకానుంది అంటూ క్యాప్సిన్ ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్త ఫోటోను మాత్రం వెల్లడించలేదు. దీంతో అభిమానులు, సినీ సెలబ్రిటీల సైతం అభినయకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరో అనేది త్వరలో తెలియబోతుంది.