Vishnupriya: సర్‌ప్రైజ్.. సర్‌ప్రైజ్ అంటే ఏదో అనుకున్నాం! కానీ.. శేఖర్ మాస్టర్ ఇలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడని టాలీవుడ్ ఆడియెన్స్ అస్సలు ఊహించలేదు. ఐటమ్ సాంగ్‌లో హాట్ బ్యూటీ కేతికా శర్మతో.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పులు చూసి.. అంతా అవాక్కయ్యారు. ఇదేం సర్‌ప్రైజ్ అయ్యా అంటూ.. శేఖర్ మాస్టర్ వేయించిన హుక్ స్టెప్‌పై.. దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ స్కర్ట్ మూమెంట్ మరీ బోల్డ్‌గా ఉందని.. నెటిజన్లంతా ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ స్టెప్పు చూశాక ఆడియెన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతారనుకుంటే.. దానికొస్తున్న నెగటివ్ రియాక్షన్లు చూసి.. రాబిన్‌హుడ్ మూవీ టీమ్ సర్‌ప్రైజ్ అవుతోంది.
ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కి కేతిక వేసిన బోల్డ్ స్టెప్పులు నచ్చినా.. మిగతా వాళ్లు మాత్రం శేఖర్ మాస్టర్ చీప్ కొరియోగ్రఫీపై దుమ్మెత్తిపోస్తున్నారు. వల్గర్ హుక్ స్టెప్ చూశాక నెటిజన్లంతా ఛీ కొడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే.. తిట్ల పురాణం మొదలుపెట్టేశారు. ఇలాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఉంటే.. పాటకు, సినిమాకు ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. ఇలాంటి స్టెప్స్ ఉంటే.. ఫ్యామిలీతో కలిసి.. సినిమా ఎలా చూస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కాదు.. హుక్ స్టెప్ మరీ ఇంత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందనుకోలేదని ఓ రేంజులో ట్రోల్ చేస్తున్నారు. ప్రతిసారి.. బూతులతో నిండిన స్టెప్పులతో.. బీపీ తెప్పించేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ వల్గర్ స్టెప్పుల సర్‌ప్రైజ్ ఇప్పుడేం కొత్త కాదు. ఇటీవలే రిలీజైన.. బాలకృష్ణ డాకు మహరాజ్ మూవీలోనూ దబిడి దిబిడి పాటకు ఈ తరహా మూమెంట్స్.. బాలయ్య బాబుతో చేయించాడు. ఆ సాంగ్ కొరియోగ్రఫీ చూశాక.. ఎవ్వరూ పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు. ఇవేం స్టెప్స్ అంటూ గట్టిగా తిట్టేశారు. ఇదేమైనా.. నీ సిగ్నేచర్ స్టెప్ అనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్గుందా శేఖర్ మాస్టర్ అని కాస్త గట్టిగానే వేసుకున్నారు. శేఖర్ మాస్టర్ నుంచి వరస్ట్ కొరియోగ్రఫీ అని సోషల్ మీడియాలో తెగ ఆడేసుకున్నారు.
ఐటెం సాంగ్స్, స్పెషల్ డ్యాన్స్, రొమాంటిక్ డ్యూయెట్స్‌లో ఈ మధ్య కనిపిస్తున్న కొరియోగ్రఫీ చూస్తుంటే.. క్రియేటివిటీ పేరుతో ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉన్నారేమో అనిపిస్తోంది. ముఖ్యంగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై.. ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. సర్‌ప్రైజ్, దబిడి దిబిడి సాంగ్స్ మాత్రమే కాదు.. ఆ మధ్య వచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలోని ఓ పాటకు కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని దారుణంగా ట్రోల్ చేశారు. ఇవేం.. దిక్కుమాలిన స్టెప్స్ అంటూ నోటికొచ్చినట్లు తిట్టేశారు. పుష్ప-2లో పీలింగ్స్ సాంగ్‌పైనా శేఖర్ మాస్టర్‌కు ట్రోలింగ్ తప్పలేదు. ఇప్పుడు వచ్చిన అది దా సర్‌ప్రైజ్ ఐటమ్ సాంగ్ కొరియోగ్రఫీ చూశాక.. చాలా మంది నెక్ట్స్ లెవెల్ బూతులు వెతుక్కుంటున్నారు. కేతికతో శేఖర్ మాస్టర్ వేయించిన ఈ ఒక్క స్టెప్.. అస్సలు జీర్ణించుకోలేని స్థాయిలో ఉంది. ఆ కాస్ట్యూమ్, ఆ స్టెప్ చూసి.. అంతా షాకయ్యారు. వరుసపెట్టి.. ఈ తరహా స్టెప్పులతో.. శేఖర్ మాస్టర్ ఇప్పుడు టాలీవుడ్‌కి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడన్నదే.. మేజర్ డౌట్.
ఈ మధ్యకాలంలో.. ఓ సాంగ్ హిట్ అవ్వాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. క్యాచీగా ఉండే స్టెప్స్ ఉంటే.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. దాంతో.. సాంగ్స్ బాగా క్లిక్ అయి.. సినిమాకు బాగా ప్రమోషన్ జరుగుతోంది. కానీ.. అందుకోసం.. ఇలాంటి దిగజారుడు స్టెప్పులు వేయించాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే.. మిస్టర్ బచ్చన్, పుష్ప2, డాకు మహారాజ్ సినిమాల సాంగ్స్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న శేఖర్ మాస్టర్.. మరోసారి ఇంత వల్గర్ స్టెప్ ఎలా వేయించాడనేదే.. ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ రకమైన బోల్డ్ స్టెప్పులు.. కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్ స్థాయిని తగ్గిస్తున్నాయి. సినిమాకు అటెన్షన్ తీసుకురావడం కోసం ఇంత దిగజారుడు కొరియోగ్రఫీ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విధమైన డ్యాన్స్ మూమెంట్స్ వల్ల.. మిగతా ఇండస్ట్రీల ముందు అనవసరంగా తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోతోందనే చర్చ కూడా సాగుతోంది.
ఐటం సాంగే కావొచ్చు.. కొరియోగ్రఫీ కొత్తగా ఉండాలనుకోవచ్చు. కానీ.. అన్నీ కొంత లిమిట్ వరకే. హద్దులు దాటితే.. మొత్తం లెక్కలే మారిపోతాయి. ముఖ్యంగా.. అమ్మాయిలతో ఇలాంటి స్టెప్స్ వేయిస్తున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ స్థాయి దిగజారుతోంది. డ్యాన్స్ స్టెప్పుల్లో విలువలనేవి లేకుండా పోతున్నాయి. డోస్ మరీ ఎక్కువవుతోంది. కొంత లిమిట్ వరకు ఈ తరహా స్టెప్పుల్ని ఎంజాయ్ చేస్తారు. కానీ.. శృతి మించితే.. అదే ఆడియెన్స్ దుమ్మెత్తిపోస్తారు. ఏ స్టెప్స్ అయితే శేఖర్ మాస్టర్‌ని నిలబెట్టాయో.. అవే ఆయన్ని డౌన్ చేసేస్తున్నాయి. వాస్తవానికి.. ఏ కొరియోగ్రాఫర్ కెరీర్‌ని మలుపు తిప్పాలన్నా.. ఒక్క క్రియేటివ్ డ్యాన్స్ మూమెంట్ చాలు. కానీ.. అదే పీక్‌లో ఉన్న కెరీర్‌ని ఈడ్చి నేలకు కొట్టేందుకు.. ఇలాంటి ఒక్క వల్గర్ స్టెప్ చాలనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇకనుంచైనా శేఖర్ మాస్టర్ ఈ తరహా స్టెప్స్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు టాలీవుడ్ ఆడియెన్స్.
తాజాగా ఈ రూమర్స్‌పై విష్ణుప్రియ స్పందించింది.‘ఇప్పుడు ఇది కూడా ఓ ప్రత్యేకమైనదే. క్రియేటివిటీని ముందుకు వెళ్లనివ్వండి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకు నచ్చకపోతే వదిలేయండి. అంతే కానీ ఇంట్లో కూర్చొని, ఇలాంటివి చేసి విమర్శించాల్సిన అవసరం లేదు అని కామెంట్ చేసింది విష్ణు ప్రియ.. విష్ణు ప్రియ కామెంట్లపై భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. విష్ణు ప్రియకి సపోర్ట్‌గా కొందరు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు అలాంటి వల్గర్ స్టెప్పులను తాము ఎంజయ్ చేయలేమంటూ కామెంట్ చేస్తున్నారు.