టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ బర్త్ డే రోజున అదిరిపోయే ట్రీట్ అందించాడు. అతడు చేస్తున్న కొత్త మూవీ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అఖిల్ నటిస్తున్న కొత్త సినిమాకు లెనిన్ అనే టైటిల్ను ఖరారు చేశారు.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ తో పాటు అఖిల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ అత్యంత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
ఇందులో అఖిల్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఈ గ్లింప్స్ లో ఉన్న అఖిల్ కు.. బయట ఉన్న అఖిల్ కు అస్సలు సంబంధమే లేనట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాపై అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు అతడు చేసిన ఏ ఒక్క సినిమా కూడా అఖిల్ కు మంచి కంబ్యాక్ అందించలేదు. అఖిల్ చివరిగా చేసిన ఏజెంట్ సినిమా సైతం డిజాస్టర్‌గా మిగిలింది. అప్పటి నుంచి 2 ఏళ్లుగా స్క్రీన్‌పై అఖిల్ కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు సరికొత్త సినిమాతో వస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఏం చేస్తుందో.