Allu Arjun And Atlee: పుష్పరాజ్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. బర్త్‌డే రోజున బ్లాక్ బస్టర్ అప్డేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. పుష్ప బ్లాక్ బస్టర్ తో బన్నీ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప2 చిత్రం బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లతో అబ్బురపరిచింది. ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో జత కడతాడు అనేది ఆసక్తికరంగా మారింది.

మొదటగా త్రివిక్రమ్ పేరు వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తో కాకుండా ఇప్పుడు మరో డైరెక్టర్ ను లైన్లో పెట్టినట్టు తెలిసింది. అతడే అట్లీ. షారుక్ ఖాన్ జవాన్ చిత్రంతో అదర కొట్టేసాడు అట్లీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ అట్లీ జత కట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం రాబోతోంది.

ఎప్పటినుంచో వీరిద్దరి కాంబోపై వార్తలు జోరుగా సాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్తడే ఉంది. ఆ రోజున వీరిద్దరి కాంబో చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మూవీకి నిర్మాతగా వ్యవహరించనున్న కళానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ తాజాగా ఓ సర్ప్రైజ్ అందించింది.

ఈ మేరకు స్పెషల్ ట్వీట్ చేసింది. త్వరలో స్పెషల్ బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందని.. అందరూ వేచి ఉండాలంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చింది. అంతేకాకుండా మాస్ అండ్ మ్యాజిక్ కలిస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ అందులో తెలిపింది. దీంతో ఆ ట్వీట్ అల్లు అర్జున్ అండ్ అట్లీ సినిమాకు సంబంధించిందే అని ఆడియన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని అఫీషియల్ గా బన్నీ బర్త్ డే రోజున అనౌన్స్ చేసి ఆ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే బన్నీ బర్త్ డే రోజున ఈ మూవీ అనౌన్స్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలిసింది. చూడాలి మరి ఎలా ఉంటుందో.

తరవాత కథనం