allu arjun arya 2: అల్లు అర్జున్ ‘ఆర్య 2’ కలెక్షన్ల వర్షం.. రికార్డు క్రియేట్!

ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ అండ్ యంగ్ హీరోల సినిమాలను రిలీజ్ చేసి మరోసారి అభిమానులను అలరిస్తున్నారు. ఒకప్పుడు బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫ్లాప్ అయిన చిత్రాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ లలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. కలెక్షన్ల సైతం భారీగా రాబడుతున్నాయి.

ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. అభిమానులు మరోసారి తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు. తాజాగా మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతంలో నటించిన ఆర్య 2 చిత్రం రి రిలీజ్ అయింది.

ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. నవదీప్ సెకండ్ హీరోగా, శ్రద్ధదాస్ కీలకపాత్రలో కనిపించింది. 2009 నవంబర్ 27 న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎన్ఎస్ ప్రసాద్, ఆదిత్య బాబు కలిసి సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దాదాపు 25 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించినట్లు తెలిసింది. ఆర్య మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఆర్య 2 ఫ్లాప్ గా మిగిలింది.

అయితే ఇప్పుడు రి రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏకంగా 65 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ సెంటర్లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో అల్లు అర్జున్ మూవీ సృష్టించిన రికార్డు సరికొత్తది కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం