Allu Arjun Comments on Revanth Reddy: సంధ్యథియేటర్ ఘటనపై అసెంబ్లీలో రేవంత్ చేసిన కామెంట్స్‌పై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓ ఫ్యామీలిలో జరిగిన విషాదం తొలిచేస్తోంది. ఇప్పుడు తన క్యారెక్టర్‌పై జరుగుతున్న దాడి ఇంకా బాధిస్తోందని అన్నారు.
“జరిగిన దుర్ఘటనలో ఎవరి తప్పులేదు. అందరూ తమ స్థాయికి తగ్గట్టు కష్టపడ్డారు. కానీ అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆ ఫ్యామిలీకి సారీ చెబుతున్‌నాను. నా వ్యక్తిత్వ హననం జరుగుతోంది. అదే టైంలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దానిపై వివరణ ఇచ్చేందుకే వచ్చాను. దేశం ముందు నా వ్యక్తిత్వ హననం జరుగుతుంటే బాధ కలుగుతుంది.”
“నేను మూడేళ్లుగా థియేటర్‌లోచూస్తేనే నాకు తెలుస్తుంది. ఇన్ని కోట్లు సినిమా ఎలా ఉందో నేను థియేటర్‌లో చూడాలి. నేను అక్కడ నిర్లక్ష్యంగా లేను. నేను పది పన్నెండేళ్లుగా ఆ థియేటర్‌లో చూశాను. నేను పూర్తిగా వారి డైరెక్షన్‌లోనే వెళ్లాను. అనుమతి లేకుండా వెళ్లి ఉంటే పోలీసులు చెప్పలేదు. నాకు రూట్ క్లియర్ చేసింది వాళ్లే. అక్కడ రోడ్డు షో కూడా చేయలేదు. థియేటర్ నుంచి కారు వెళ్తూ అగిపోయింది. అప్పుడు నేను కనిపించకపోతే జనం వెళ్లరు. అందుకే వెళ్లాల్సి వచ్చింది. నేనే కాదు ఎవరైనా సెలబ్రెటీ అదే చేస్తారు. అంతమంది నా కోసం వస్తే నేను కారులో చూడకుండా వెళ్లిపోతే గర్వం అనుకుంటారు. అందుకే కారులోంచి బయటకు వచ్చి చేయి ఊపి వెళ్లిపోయాను .”
“థియేటర్‌లో నాకు ఏ పోలీసులు వచ్చి విషయం చెప్పలేదు. నా స్టాఫ్ వచ్చి క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పడంతో వెళ్లిపోయాను. నాకు తర్వాత రోజు వరకు ఇన్సిడెంట్ గురించి తెలియదు. తర్వాత రోజు నాకు చెబితే షాక్ అయ్యాను. వెంటనే బన్నీ వాసుకు పంపించాను. హాస్పిటల్‌కు వెళ్తానంటే వద్దన్నారు. తర్వాత కేసు పెట్టారు ఇప్పుడు కలిస్తే సమస్య అవుతుంద” అని అన్నారు.
తనకు గుడిలాంటి థియేటర్‌లో ప్రమాదం జరగడం నిజంగానే తనకు చాలా బాధాకరమన్నారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు ఎవర్నీ బాధ్యులను చేయలేమన్న ఆయన… ఇందులో ఎవరి తప్పు లేదని పదే పదే చెప్పారు. అక్కడ ఎలాంటి దుర్ఘటన జరగకుండా ఉండేదుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించారని అన్నారు. కానీ జరగకూడదనిది జరిగిందన్నారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన కేవలం అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ అన్నారు. థియేటర్‌కు రావద్దని పోలీసులు చెప్పినప్పటికీ అల్లు అర్జున్ వచ్చాడని అందుకే తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఒక్క రోజు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని పరామర్శించడానికి క్యూకట్టిన సినీ పరిశ్రమ పెద్దలు బాధిత కుటుంబాన్ని కనీసం ఏ ఒక్క ప్రముఖుడూ పరామర్శించలేదని మండిపడ్డారు. కచ్చితంగా సినిమాలు వ్యాపారం చేసుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి రాకూడదని అన్నారు. ఇకపై తెలంగాణ అలాంటి పరిస్థితి రాదన్న రేవంత్… బెనిపిట్‌షోలు ఉండవని టికెట్లు రేట్లు పెంచేది కూడా లేదని తేల్చి చెప్పారు.