ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. పుష్ప బ్లాక్ బస్టర్ తో బన్నీ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప2 చిత్రం బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లతో అబ్బురపరిచింది. ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో జత కడతాడు అనేది ఆసక్తికరంగా మారింది.
మొదటగా త్రివిక్రమ్ పేరు వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తో కాకుండా ఇప్పుడు మరో డైరెక్టర్ అట్లీను లైన్లో పెట్టినట్టు వార్తలు జోరుగా సాగాయి. షారుక్ ఖాన్ జవాన్ చిత్రంతో అదర కొట్టేసాడు అట్లీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ అట్లీ జత కట్టినట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం రాబోతోందని తెలిసి ఎగిరి గంతేశారు.
ఎప్పటినుంచో వీరిద్దరి కాంబోపై వార్తలు జోరుగా సాగాయి. కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ ఏప్రిల్ 8వ తేదీన అంటే ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఆ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. అల్లు అర్జున్, అట్లీ కాంబో చిత్రానికి సంబంధించి కిర్రాక్ ట్రీట్ అందించారు. బన్నీ బర్త్ డే సందర్భంగా.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. అల్లు అర్జున్, అట్లీ కాంబో ఫిక్స్ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ సర్ప్రైజ్ అందించారు.
ఇందులో భాగంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ముందుగా అల్లు అర్జున్‌ని అట్లీ కలుస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ కాసేపు మాట్లాడి.. ఈ మూవీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనున్న ప్రొడ్యూసర్ కళానిధి మారన్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వీరు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆపై ఫ్లైట్ ఎక్కి అమెరికాకు వెళ్తారు. అక్కడ లాస్ ఏంజెల్స్ లోని ఒక వీఎఫ్ఎక్స్ కంపెనీని సంప్రదిస్తారు.
ఈ మేరకు అక్కడ చూపించిన విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన షూట్స్ అన్నీ అక్కడ కనిపించాయి. దీంతో బన్నీ మూవీ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా అక్కడ బన్నీ లుక్‌ను కూడా టెస్ట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.