Allu Arjun Crying In Front of Media: సంధ్య థియేటర్‌ ఘటనపై మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్

Allu Arjun

Allu Arjun Emotion Regarding Sandhya Theater Incident: సంధ్య థియేటర్‌లలో జరిగిన ఘటనపపై అల్లు అర్జున్ ఎమోషన్ అయ్యారు. తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఎమోషనల్ అయ్యారు. ఉబికి వచ్చే కన్నీళ్లను దాచుకొని గొంతు తడారిపోతున్నా మంచి నీళ్లు తాగుతూ మీడియాతో మాట్లాడారు. ఆ ఘటనపై ఇప్పటికీ నేను బాధపడుతున్నానని అన్నారు.

థియేటర్‌లో అల్లు అర్జున్ ర్యాలీ చేశానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనన్నారు. తాను ఎలాంటి ర్యాలీ చేయలేదన్నారు. థియేటర్‌కు కొద్ది దూరంలో తన కారు ఆగిపోయిందని… ముందుకు కదల్లేదు. పోలీసులు వచ్చి కాస్తే మీరు వచ్చి వెళ్లమని చెబితే వారు కదులుతారని చెప్పడంతోనే తాను కారు నుంచి పైకి వచ్చానని అన్నారు.

అక్కడ జరిగిన ఘటన గురించి తనకు చాలా ఆలస్యంగా తెలిసిందన్నారు. తనకు ఆ ఏజ్ కొడుకున్న ఉన్నాడని విషయం తెలిస్తే అంత ఈజీగా ఎలా వదిలేస్తానని అన్నారు. తర్వాత కేసుల మిగతా విషయాలు తెలుసుకున్న తర్వాత వీడియో పెట్టానని తెలిపారు. ఇలా వషయాలు చెప్పేటప్పుడు పదే పదే తాను ఏమోషన్ అవుతున్నానని అని చెప్పారు. ఏ మాత్రం ట్రిగ్గర్ చేసినా ఏదైనా మాట్లాడితే అది ఎటు దారి తీస్తుందో తెలియదన్నారు. అందుకు తను చెప్పేది ముందు వినాలని అన్నారు.

ఈ క్షణం అనుమతి ఇచ్చిన ఆ ఫ్యామిలీని కలిసేందుకు సిద్ధమని అల్లు అర్జున్ అన్నారు. విషయం జరిగినప్పటి నుంచి సినిమా ఇంత విజయవంతం అయినా తనకు హ్యాపీ లేదని అన్నారు. చాలా ప్రాంతాల నుంచి విజయోత్సవాలకు ఫోన్లు చేస్తున్నా వెళ్లలేకోతున్నానని చెప్పుకొచ్చారు. ఆ విజయాన్ని ఎంజాయ్ చేసే పరిస్తితి లేకపోయిందని వివరించారు. అంతే కాకుండా రాబోయే సినిమాలకి కూడా సిద్ధమయ్యే పరిస్థితి కూడా లేదని వాపోయారు. జాతీయ స్థాయిలో చాలా ఈవెంట్లను రద్దు చేసినట్టు చెప్పారు.

ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనే తాను డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు నిరంతరం ఆలోచిస్తున్నామని వాటిని ఇప్పుడు చెప్పడం కూడా కరెక్టు కాదన్నారు. అలా చెబితే ఒత్తిడి తలొగ్గి చేసినట్టు ఉంటుందన్నారు. అయినా సరే ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని క్యారెక్టర్‌ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఎమోషన్ అయ్యారు. నోట మాటరాలేదు. చాలా బాధగా ఉందని కాసేపు ఏం మాట్లాడలేకపపోయారు. తెలుగువారు గర్వపడేలా సినిమా చేశానని అనుకుంటుంటే ఇలా కిందకు లాకుగుతున్నారని వాపోయారు.

తాను ఎవరినో నిందించడానికి ప్రెస్ మీట్ పెట్టలేదని సినిమా ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా సపోర్టు చేసిందన్నారు. కానీ 22 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న నమ్మకాన్ని ఒక్క రాత్రిలో పాడు చేస్తున్నారని అన్నారు. మానవత్వం లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున సమస్యలు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నానంటూ మీట్‌ ప్రెస్ మీట్ మధ్యలో వెళ్లిపోయారు.

అనంతరం మాట్లాడిన అల్లు అరవింద్‌… అల్లు అర్జున్ పరిస్థితి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లో కూడా యాక్టివ్‌గా ఉండటం లేదని ఏదో మూలన కూర్చొని దాని కోసమే ఆలోచిస్తున్నాడని అన్నారు. ఎక్కడికైనా వెళ్లమని చెప్పినా వెళ్లడం లేదని అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సంపాదించుకున్న ఫేమ్ ఒక్క రోజులో రాలేదనన్నారు. ప్రజలకు తమ మూడు తరాల గూరించి తెలుసన్నారు. అలాంటి వారిపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉందన్నారు. ఇప్పుడున్న అభిమానం ఇలాగే కొనసాగించాలని కోరారు.

తరవాత కథనం