Pushpa2 OTT Release : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఓటీటీ డేట్ ఫిక్స్..

image credit: X

Allu Arjun Pushpa2 OTT Release:  అల్లు అర్జున్‌, సుకుమార్‌ల పుష్ప 2 ప్రభంజనం బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతోంది. కేవలం నాలుగు వారాల్లో రూ.1800 కోట్ల వసూలు చేసింది. త్వరలోనే బాహుబలి 2 రికార్డ్‌లు బ్రేక్ చేయబోతోంది. ఆల్ టైమ్‌ హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో పుష్ప 2 ఇప్పటికే మూడో స్థానంలో ఉంది. త్వరలోనే బాహుబలి 2ని వెనక్కు నెట్టి ఆ స్థానంలోకి వచ్చే అవకాశాలుంటాయి. బాహుబలి 2 రికార్డ్స్ బద్దలుకొడితే కానీ పుష్ప 2 OTT లో వచ్చే ఛాన్స్ లేదు.

నెట్ ఫ్లిక్స్ లో పుష్ప 2

పుష్ప 2 సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీగా వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే 8 వారాలు పూర్తైన తర్వాతే స్ట్రీమింగ్ కి అనుమతింంచారు. పుష్ప 2 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పటి వరకు థియేటర్లో చూడని వారంతా OTT స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.ఆ మధ్య మూవీ లీక్ అయిందనే వార్తలొచ్చినా OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారంతా.

వసూళ్ల రచ్చ

పుష్ప 2 అన్ని భాషల్లోనూ రికార్డ్‌ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో వచ్చిన వసూళ్లు చూసి బాక్సాఫీస్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇదేం రచ్చ అనుకోనివారు లేరు. ఇప్పటికీ నార్త్ లో ఈ మూవీ వసూళ్లు జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా వీకెండ్స్ లో కలెక్షన్లు దుమ్ములేపుతున్నాయ్…అందుకే OTT రిలీజ్ కి కంగారు వద్దనే ఉద్దేశంతో ఉన్నారు మేకర్స్.

జనవరి ఎండింగ్ లో OTT స్ట్రీమింగ్

మైత్రి మూవీ మేకర్స్ వారు పెట్టిన గడువు జనవరి ఆఖరివారంతో ముగుస్తుంది. అప్పటివరకూ థియేటర్లలో పుష్పరాజ్ సందడి ఉంటుంది. జనవరి ఆఖరివారంలో OTTలో వస్తోంది. ఈ లోగా సంక్రాంతి సందర్భంగా పుష్ప2 వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లిగా జీవించేసింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో భర్తని సపోర్ట్ చేసే సీన్ కి థియేటర్లో విజిల్స్ పడ్డాయ్. పీలింగ్స్ సాంగ్ పై ట్రోల్స్ వచ్చినా బాగా వైరల్ అయింది. సామి సాంగ్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ విషయంలో సమంత ఊ అంటావా సాంగ్ ని మించి ఉంటుందో లేదో అనుకున్నారు కానీ అంతకుమించి అనిపించింది కిస్సిక్.. శ్రీలీల వేసిన స్టెప్పులు మళ్లీ మళ్లీ చూసేలా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు.

బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప 2…సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత మరింత వార్తల్లో నిలుస్తూ ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి రీసెంట్ గా బెయిల్ వరకూ పుష్ప 2 పై నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది.  వసూళ్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణం అనే టాక్ ఉంది.  మొత్తానికి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఈ మూవీ OTT లో చూడాలంటే…జనవరి ఆఖరివారం వరకూ ఆగాల్సిందే… ఓటీటీలో వచ్చేస్తే చాలు ఇక పుష్ప 2 సీరియల్ లా చూసేలా ఉన్నారు అభిమానులు.

తరవాత కథనం