Chhaava Telugu: ఛావా.. ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది.. వేల మంది సైనికుల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసే ఓ గొప్ప వీరుని గురుంచి.. మొగల్స్ నుంచి లక్షల మంది హిందువుల రక్షణ కోసం తన శరీరాన్ని ముక్కలు చేసుకోవడానికి కూడా వెనుకాడని మహారాజు గురుంచి, అయన మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. భారత దేశ చరిత్రలో వీరుల గురుంచి మాట్లాడుకుంటే.. ఓ అర్జునుడు, ఓ శివాజీ మహారాజ్.. ఓ అభిమన్యుడు..
ఓ శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. తొలత హిందీలో రిలీజ్ అయి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్లకుకట్టుగా చూపెట్టింది. ఈ చరిత్ర తెలుసుకునేందుకు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆశక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. చాలామంది ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని.. సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చేందుకు గీతా ఆర్ట్ సంస్థ ముందుకు వచ్చింది. మార్చి 7న థియేటర్లో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో ఛావా వివాదంలో చిక్కుకుంది. ఏపీలోని నెల్లూరుకి చెందిన ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్ గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలక్టర్‌ను కలిసి ఛావా సినిమాను రిలీజ్‌ను ఆపాలంటూ డిమాండ్ చేశారు. చరిత్రను వక్రీకరించి ఛావా సినిమాను తీశారని మెమోరాండంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాలో 16 వశతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా చిత్రీకరించారని, అందువల్ల రిలీజ్‌కు ముందు నార్త్ ఇండియాలో గొడవలు జరిగాయని, ఆంధ్రప్రదేశ్‌లోను అలాంటి ఘర్షణలు జరిగే అకాశం ఉందని తెలిపినట్లు సమాచారం. మరి కలెక్టర్ నుండి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సిందే.. ఛావా విడుదలకు ఒక్కరోజే టైమ్ ఉంది. అసలు ఏపీలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.