Aditya 369 Rerelease Trailer: బాలకృష్ణ ‘ఆదిత్య 369’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది ఇండియాలో తొలి టైమ్ ట్రావెల్ మూవీ. 1991లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. టాలీవుడ్ నుంచి విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఎనలేని క్రేజ్ అందుకుంది. హాలీవుడ్ రేంజ్‌ సన్నివేశాలతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇప్పుడీ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రీరిలీజ్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రీరిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లింది.

కాగా ఈ చిత్రాన్ని 4కే వెర్షన్‌లో థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఎప్పుడో 34 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు 4కే వెర్షన్ లో రీరిలీజ్ కానుండటంతో ఆసక్తి రేపుతోంది. అది కాకుండా ఆల్రెడీ మార్చి 30న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఆదిత్య 369 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఆదిత్య 999ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణతోపాటు అతని కొడుకు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని సమాచారం. వార్తలు అయితే జోరుగా సాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ ఈ సీక్వెల్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

తరవాత కథనం