Akhanda 2: హిమాలయాల్లో బాలయ్య ‘అఖండ 2’.. హైలైట్ సీన్స్ షూట్!

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ఏడాదికి ఒక సినిమా తీసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. గత నాలుగేళ్ల నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస సినిమాలతో అభిమానులను అలరించాడు.

ఇప్పుడు ఆయన లైనప్ లో మరో సినిమా ఉంది. అదే “అఖండ 2”. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు హిట్లు లేక ఇబ్బంది పడుతున్న బాలయ్యకు ఈ సినిమా మంచి హిట్ అందించింది.

పవర్ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. కలక్షన్ల పరంగా కూడా ఈ సినిమా అదరగొట్టేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సీక్వెల్ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య, ఆది పై కొన్ని సీన్లను సూట్ చేశారు. అలాగే ఇటీవల మహా కుంభమేళా జరిగిన విషయం తెలిసింది. అక్కడకి కూడా అఖండ టీం వెళ్లినట్లు సమాచారం. రియల్ లొకేషన్స్ లో కొన్ని సీన్స్ షూట్ చేసి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక సినిమా మొత్తాన్ని రియలిస్టిక్ గా చూపించేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా హిమాలయాలకు అఖండ టీం బయలుదేరినట్లు సమాచారం. అక్కడ కొన్ని అద్భుతమైన సీన్లను చిత్రీకరించనున్నారట. సినిమాలో హైలైట్ సీన్స్ ను దర్శకుడు బోయపాటి అక్కడ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దీంతో నందమూరి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. చూడాలి మరి అన్ని పనులు పూర్తి చేసుకుని ఈచిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

తరవాత కథనం