నటి సమంత ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె నటించిన సీటాడెల్ హనీ బన్నీ అనే సిరీస్ విడుదలైంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కలిసి తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా అనంతరం మా ఇంటి బంగారం అనే మూవీని సమంత ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె నటిస్తున్న మరో కొత్త వెబ్ సిరీస్ రక్త్ భమండ్. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ ను దర్శకుడు రహి అనిల్ బర్వే తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో ఆదిత్య రాయి కపూర్, వామిక గబ్బి, అలీ ఫజల్ సహా మరెందరో నటినటులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ ను ప్రముఖ ott సంస్థ నెట్ఫ్లిక్స్, డి 2 ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎవరు ఊహించిన బడ్జెట్ను ఈ సిరీస్ కు పెడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ విషయంలో భారీ స్కాం జరిగినట్టు సమాచారం.
2024 సెప్టెంబర్ లో మొదలైన ఈ సిరీస్ షూటింగ్ ఇంకా కీలక దశకు చేరుకోకుండానే 50 శాతం బడ్జెట్ ఖర్చయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసి మూవీ టీం షాక్ అయినట్లు సమాచారం. అందువల్లనే ఈ సిరీస్ విషయంలో కోట్లలో భారీ స్కాం జరిగినట్టు పలువురు అనుమానిస్తున్నారు. ఈ స్కాం వెనుక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారని గుర్తించి ఆయన్ను విచారించే పనిలో పడిందని సమాచారం. ఈ సిరీస్ ఇప్పటివరకు కేవలం 26 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుందట.
ఇంకా బ్యాలెన్స్ షూటింగ్ చాలానే ఉందని తెలుస్తోంది. మరి ఇంత తక్కువ రోజుల్లో 50 శాతం ఖర్చు అయిపోయిందంటే ఏం చేసి ఉంటారా అని పలువురు అభిప్రాయపడుతున్నారట. అందులోనూ దర్శకుడు అప్పుడప్పుడు సెట్స్ లో చేస్తున్న మార్పులు చేర్పుల వల్ల కూడా వ్యయం పెరుగుతోందని సమాచారం. చూడాలి మరి ఈ సిరీస్ ముందుకు వెళ్తుందా ఇంకా ఏదైనా సమస్యల్లో ఇరుక్కుంటుందా అని.