Ranya Rao Gold Smuggling: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో.. మరో సంచలన విషయాలు

Ranya Rao Gold Smuggling

Ranya Rao Gold Smuggling: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తవ్వే కొద్ది సంచలనాలు బయపడుతూనే ఉన్నాయి. DRI రిమాండ్‌ నివేదికలో మరిన్ని విషయాలు వచ్చాయి. ఈ కేసులో ఆభరణాల వ్యాపారి సాహిల్ సకారియా జైన్ కీలక పాత్ర పోషించినట్లు డీఆర్‌ఐ తేల్చింది. గోల్డ్ స్మగ్లింగ్ చేయడానికి రన్యారావుకి సహకరించింది ఆయనేనని.. హవాలా నగదు బదిలీకు సాయం చేశాడని అధికారులు తెలిపారు.

దుబాయ్‌కు 38 కోట్లు రూపాయలు, బెంగళూరులోని రన్యాకు కోటి 73 లక్షలు హవాలా రూపంలో ఇచ్చానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టు డీఆర్ఐ తెలిపింది. అంతేకాదు.. మార్చి 4న రన్యా ఇంట్లో గుర్తించిన డబ్బు.. బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన ఆమెకు వచ్చిన డబ్బు అని చెప్పాడు సాహిల్. ప్రతి లావాదేవీకి 55 వేల రూపాయల కమీషన్ తీసుకున్నానని డీఆర్ఐ అధికారుల ఎదుటు అంగీకరించాడు.

సాహిల్‌కు చెందిన రెండు ఫోన్లు, ల్యాప్‌టాప్ నుంచి మరిన్ని కీలక ఆధారాలు సేరించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో రన్యా సహా ముగ్గురిని అరెస్టు చేశారు. నగల వ్యాపారి సాహిల్‌ జైన్‌ ఏ3గా కస్టడీలోకి ఉన్నారు. ఆయన్ని ఏప్రిల్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు.. బెయిల్‌ కోసం రన్యారావు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.

కాగా రన్యారావు 2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్ కి రీమేక్ రూపొందించిన ఈ సినిమాలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కన్నడ నటుడు గణేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపింతిన రన్యారావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ.. అధికారులు పట్టుబడింది.

తరవాత కథనం