Bulli Raju: మెగాస్టార్ సినిమాలోనూ బుల్లి రాజు.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే?

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రియుల్ని విపరీతంగా అలరించింది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి విక్టరీ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

ఇక ఈ సినిమాలో బుల్లి రాజు పాత్రలో నటించిన బాల నటుడు రేవంత్ బీమల ఒకసారిగా పాపులర్ అయిపోయాడు. బుల్లి రాజు పాత్రలో ఆ బాలుడు నటించిన తీరు అందర్నీ అట్రాక్ట్ చేసింది. అతడి యాక్టింగ్ కు ఎంతోమంది ఫిదా అయిపోయారు అనడంలో ఇలాంటి సందేహము లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రేవంత్ భీమలా క్రేజ్ పెరిగిపోయింది.

ఏపీలోని భీమవరం నుంచి వచ్చిన ఈ బాల నటుడు సినిమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ కాలం గడిపేసిన ఈ బుడ్డోడు అనిల్ రావిపూడి కంటపడ్డాడు. దీంతో అతడు ఇచ్చిన అవకాశాన్ని బుడ్డోడు బుల్లి రాజు సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో పలు ఆఫర్లు అందుకుంటున్నాడు.

వరుసగా కొన్ని సినిమాలను లైన్లో పెట్టినట్టు తెలిసింది. ఇదే కాదు రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దాదాపు రోజుకు లక్ష రూపాయలు వరకు రెమ్యూనరేషన్ కోరుతున్నట్లు తెలిసింది. దీంతో ఇంత చిన్న వయసులోనే అంత డబ్బు సంపాదించడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా రేవంత్ బీమలకు మరో బిగ్గెస్ట్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. త్వరలో అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో రేవంత్ బీమల కూడా నటించబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రేవంత్ భీమాల యాక్టింగ్ చూసి అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాలో కూడా అతనికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఒక్క సినిమాతోనే పాపులర్ అయిపోయిన రేవంత్ బీమాల ఇప్పుడు తన తదుపరి ఛాన్స్ చిరంజీవితో దొరకడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.

తరవాత కథనం