ఇప్పుడంతా ఛావా ఛావా.. అనే పేరు వినిపిస్తోంది. ఎవ్వరి నోట విన్న ఈ సినిమా పేరే. మొబైల్ ఓపెన్ చేస్తే ఈ సినిమా వీడియోలే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దుమ్ము దులిపేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. సినీ ప్రియులు ఈ చిత్రానికి బ్రహ్మ రథం పడుతున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఇందులో ప్రధాన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకుల్ని ఏడిపించేసాడు. ఇప్పటివరకు అతడి నటనా ప్రస్థానం ఒక ఎత్తు అయితే.. ఛావా మూవీలో ఆయన నటన మరో ఎత్తు అనే చెప్పాలి. రియల్ లైఫ్ కథలకు ప్రాణం పోసి విక్కీ కౌశల్ మరోసారి తన ఉనికి చాటుకున్నాడు. శంభాజీ పాత్రలో ఆయన నటనకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
లక్ష్మణ్ ఉట్కేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రధాని మోదీని సైతం ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా అదరగొడుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడంతో చాలామంది తెలుగులో రిలీజ్ అయితే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు.
అలాంటివారికి తాజాగా గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నహాలు మొదలవుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయింది. మార్చ్ 7వ తేదీన ఈ చిత్రాన్ని తెలుగు వర్షన్ లో రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. చూడాలి మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.