vishwambhara first song: ఆంజనేయ భక్తుడి సినిమా నుంచి తొలిపాట వచ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంబర. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బింబిసారా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫాంటసీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.

అలాగే ఆశికారంగనాథన్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, కునాల్ కపూర్ వంటి నటీమణులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ, విక్రమ్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లిమ్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ మెగా అభిమానులను ట్రాన్సలో పెట్టేసింది.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు. రామ రామ అంటూ శ్రీరాముడిని కీర్తిస్తూ ఈ సాంగ్ అత్యద్భుతంగా ఉంది. ఎం ఎం కీరవాణి ఈ భక్తి పాటకు మంచి ట్యూన్ అందించారు. రామ జోగి శాస్త్రి లిరిక్స్ అందించగా శంకర్ మహదేవన్ తో పాటు లిప్సిక భాష్యం ఆలపించారు.

ప్రస్తుతం ఈ సాంగ్ అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ కావల్సింది. కానీ అని వార్య కారణాలవల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ మూవీ వాయిదా పడినట్టు తెలిసింది. అయితే కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం