David Warner: ‘రాబిన్ హుడ్’ కోసం డేవిడ్ వార్నర్ భారీ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందేే!

నితిన్ హీరోగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా తెరకెక్కిన కొత్త చిత్రం రాబిన్ హుడ్. ఇందులో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది.

రిలీజ్ కి ముందు మూవీ యూనిట్ అదిరిపోయే ప్రమోషన్స్ చేసింది. నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్ కలిసి చేసిన ప్రమోషన్స్ బాగా హిట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక థియేటర్లలో ఈ చిత్రం విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాలో అతడి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే వార్నర్ రాబిన్ హుడ్ చిత్రంలో నటించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో వార్నర్ రన్ టైం కేవలం 3 నిమిషాలే ఉంది. ఈ మూడు నిమిషాల కోసం వార్నర్ భారీగా పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. రాబిన్ హుడ్ చిత్రం కోసం డేవిడ్ వార్నర్ దాదాపు రూ.2.5 నుంచి రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ మూడు నిమిషాల నిడివి కోసం వార్నర్ పై రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందని సమాచారం. దీన్నిబట్టి రోజుకు రూ.1.50 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం