Dhanush Divorce: ధనుష్ ఐశ్వర్యా రజనీకాంత్‌లకు విడాకులు మంజూరు, మరి పిల్లలు ఎవరి దగ్గరా?

Image Credit: Social Media

ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush), భార్య ఐశ్వర్యా రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) విడాకులు తీసుకున్నారు. బుధవారం ఇరువురి వాదనలు విన్న చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు.. విడాకులపై తీర్పు ఇచ్చింది. వీరిద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మూడు సార్లు విచారణ జరిగింది. అయితే ధనుష్(Dhanush), ఐశ్వర్యా రజనీకాంత్‌లు రెండు సార్లు కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఈ నెల 27న (బుధవారం) జరిగిన విచారణకు ఐశ్వర్య మాత్రమే హజరయ్యారు. దీంతో న్యాయమూర్తి ఆమెను విచారించి విడాకులు మంజూరు చేశారు.

ధనుష్(Dhanush), ఐశ్వర్యాలు 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు లింగ, యాత్ర ఉన్నారు. 18 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత.. 2022, జనవరి 17న ధనుష్, ఐశ్వర్యా తాము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ధనుష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 18 ఏళ్ల పాటు తామిద్దరం స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా కలిసి జీవించామని, ఇప్పుడు తాము వేరు వేరు మార్గాలను ఎంచుకోవడం అనివార్యమైందని వెల్లడించారు.

పిల్లల బాధ్యత ఎవరిది?

విడాకుల ప్రకటన తర్వాత కూడా వీరిద్దరు చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలోనే కలిసి నివసించారు. తమ పిల్లలను ఇద్దరి చూసుకుంటున్నారు. అయితే, విడాకులతో తాము విడిపోయినా.. పిల్లల బాధ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, వారిని కంటికి రెప్పలా చూసుకుంటామని ఇప్పటికే వీరిద్దరూ స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో కోర్టు ఏం చెప్పిందనేది ఇంకా తెలియరాలేదు. పిల్లలు పూర్తిగా ఐశ్వర్య వద్దే ఉండాలని చెప్పారో.. లేదా ధనుష్(Dhanush) దగ్గర ఉండాలనేది తెలియాల్సి ఉంది.

తరచు వార్తల్లో ధనుష్

ధనుష్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరి విడాకుల విషయం ఇప్పటికే చర్చనీయం కాగా.. ఇటీవల నటి నయన తార సోషల్ మీడియలో పెట్టిన పోస్ట్ మరింత దుమారం రేపింది. నయన్ వెడ్డింగ్ డాక్యుమెంటరీ Nayanthara: Beyond the Fairy Tale లో 2015 తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీ ధాన్’ నుంచి 3 సెకన్ల బీహైండ్-ది-సీన్ వీడియోను ఉపయోగించారు. అయితే, ఆ చిత్రానికి నిర్మాత అయిన ధనుష్ ఇందుకు అంగీకరించలేదు. తన అనుమతి లేకుండా వీడియోను వినియోగించారనే కారణంగా రూ.10 కోట్ల పరిహారం కోరుతూ ఆ జంటకు నోటీసులు పంపారు. నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై ధనుష్(Dhanush) మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ధనుష్ (Dhanush) తాజా ప్రాజెక్ట్స్ ఇవే.. 

తమిళంలో ‘ఇడ్లీ కడై’ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ 2025న విడుదల కానుంది. ధనుష్ స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వమిస్తున్న ఈ మూవీలో నిత్యా మీనన్, శాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు తెలుగులో నాగార్జున, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కుబేర’ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా 2025లోనే విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పలు ప్రోమోలు.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఇవి కాకుండా ధనుష్‌(Dhanush)కు పలు హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్‌లో కూడా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

తరవాత కథనం