తమిళ స్టార్ హీరో ధనుష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అతడు నటిస్తున్న కొత్త చిత్రం కుబేర.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా కనిపించబోతుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. అతడు ఇందులో బిచ్చగాడు రోల్ చేస్తున్నాడు.
అలాగే నాగార్జున బిజినెస్ మాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో స్టార్ హీరోలు ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్రావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ మూవీని జూన్ 20న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ యూనిట్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించింది. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేసింది. పోయిరా మావా అంటూ సాగే ఈ సాంగ్లో ధనుష్ మాస్ డాన్స్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది