Prabhas Kalki 2 shooting: నాగ్ అశ్విన్ ట్రీట్ అదిరింది.. ‘కల్కి 2’ షూటింగ్‌పై కిక్కిచ్చే అప్డేట్..!

రెబల్ స్టార్ ప్రభాస్ గతేడాది కల్కి మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. కనివిని ఎరుగని రేంజ్ లో ఈ సినిమా వసూళ్ళు రాబట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈ సినిమాకు కేటాయించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది.

బడా బడా చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. ప్రభాస్ సైతం తన పాత రికార్డులను బ్రేక్ చేసి కల్కి సినిమాతో కొత్త రికార్డులను సృష్టించాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ పై అందరి దృష్టి ఉంది. ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2 షూటింగ్‌కి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

తాజాగా ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించాడు. ఇవాళ నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ దంపతులు తిరుమలలోని శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా కల్కి 2 సినిమా షూటింగ్‌కి సంబంధించి ట్రీట్ అందించాడు.

ఈ సినిమా గురించి అందరూ అడుగుతున్నారని.. కానీ ప్రస్తుతం అందులోని పాత్రలపై స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నాడు. అశ్వద్ధామ, సుమతి పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నామని.. ఆ పాత్రలను మరింత ఎంగేజ్ చేయబోతున్నామని తెలిపారు. అందువల్ల స్క్రిప్ట్ వర్క్ జరిగిన దాన్నిబట్టి షూటింగ్ మొదలుపెడతామని అన్నారు.

వీలైనంతవరకు ఈ సంవత్సరం చివర్లో షూటింగ్ ప్రారంభించబోతున్నాం అని చెప్పుకొచ్చారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టెంట వైరల్ గా మారాయి. అవి విని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు. ఈసారి మరింత రంజుగా ఉంటుందని తెగ చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఇది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో.

తరవాత కథనం