Nani: నాని రెండు జడల వెనుక రియల్ స్టోరీ.. ఎమోషన్ అయిన దర్శకుడు!

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీసి కలెక్షన్ వర్షం కురిపిస్తున్నాడు. భారీ హైప్ సినిమాలను కాకుండా చిన్న చిన్నగా చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. గత ఏడాది రెండు సినిమాలు తీసి అదరగొట్టేసాడు. ఇక ఈ ఏడాది మరో పవర్ఫుల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

తనకు గతంలో దసరా సినిమాతో అదిరిపోయే హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. అదే ‘ది పారడైజ్’ మూవీ. ఇటీవలే ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే గ్లిమ్స్ రిలీజ్ చేశారు. నాని ఫస్ట్ లుక్ ను రివిల్ చేస్తూ విడుదలైన ఈ గ్లిమ్స్ ఓ రేంజ్ లో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.

అందులో నాని గెటప్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని పాత్రలో నాని గెటప్ ఉండడంతో అభిమానుల సైతం నివ్వెరపోతున్నారు. నాని ఊర మాస్ లుక్కుకు ఫిదా అయిపోతున్నారు. రెండు జడలు వేసుకుని ఉన్న నాని లుక్ అదిరిపోయింది అంటున్నారు. ఈ నేపథ్యంలో నాని రెండు జడల విషయంపై దర్శకుడు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదేల సినిమాలో నాని హెయిర్ స్టైల్ పై మాట్లాడారు. అలా పెట్టడం వెనుక పెద్ద ఎమోషన్ ఉందని ఆయన తెలిపాడు. దాని గురించి పూర్తిగా చెప్పనని.. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుతానని అన్నాడు. నాని రెండు జడల వెనక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయని అన్నాడు.

తన చిన్నతనంలో అతడు అలానే ఉండేవాడినని తెలిపాడు. తాను ఐదో క్లాస్ వరకు స్కూలుకి రెండు జడలు వేసుకుని వెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు. తన తల్లి రెండు జడలు వేసి స్కూలుకు పంపించేదని పేర్కొన్నాడు. అయితే ఆ లుక్ సినిమా స్టోరీ కి ఎలా కనెక్ట్ అవుతుందో మాత్రం అప్పుడే చెప్పనని వివరించాడు. ప్రస్తుతం అతడు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఇందులో నాని ఒక వేశ్యరాలు కొడుకుగా కనిపించబోతున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా వచ్చే ఎడాది విడుదల కారణం ఉంది.

తరవాత కథనం