Dope Song: ‘డోప్’ సాంగ్ ప్రోమో.. ఏంటి శంకర్ మామ అలా చేశావ్!

Image Credit: Game Changer

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీకి దిల్ రాజు, శిరిష్‌ నిర్మాతలు. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన ‘‘జరగండి.. జరగండి’’, ‘‘రా మచ్చా మచ్చా’’, ‘‘నా నా హైరానా సాంగ్‌’’ పాటలు ఏ స్థాయిలో రికార్డులు బద్దలకొట్టాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో సాంగ్ కూడా బుధవారం రిలీజ్ అయ్యింది. నిర్మాత దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా నిర్మాతలు ‘డోప్’ సాంగ్ ప్రోమో వదిలారు. అయితే, ఇందులో ఎక్కడా చెర్రీ, కియారాల డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.

సాంగ్ ఎలా ఉంది?

తాజాగా విడుదల చేసిన ‘డోప్’ సాంగ్ ప్రోమోను చూస్తుంటే.. కాస్త ‘రోబో’, ‘అపరిచితుడు’ మూవీస్‌లో సాంగ్స్‌‌ను తలపిస్తోంది. శంకర్ మార్క్ మూవీస్‌లో అలాంటివి కామన్ అని తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకోగా.. కియరా ఎప్పటిలాగే తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది. అయితే, ఈ సాంగ్ ప్రోమో కొన్ని సెకన్లపాటే ఉంది. 39 సెకన్ల ఈ ప్రోమోలో వీరిద్దరు కనిపించేది కేవలం 20 సెకన్లు మాత్రమే. అందుకే, ఫ్యాన్స్ ఈ ప్రోమోపై రుసరుసలాడుతున్నారు. ‘‘ఏంటి శంకర్ మామా అలా చేశావ్. ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే.. చెర్రీని అలా చూపించి అలా మాయం చేశావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, పాటను కూడా పూర్తిగా రివీల్ చెయ్యలేదు.

21న రిలీజ్ కానున్న ‘డోప్’ సాంగ్

జానీ మాస్టార్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం సాహిత్యాన్ని అందించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తమన్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఈ గేయాన్ని ఆలపించారు. పూర్తి పాటను డల్లాస్‌‌లో డిసెంబర్ 21న నిర్వహించే ఈవెంట్‌లో రాత్రి 9 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇండియాలో ఈ పాటను డిసెంబర్ 22న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తారు.

శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జి-స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు పాటలు విడుదల కాగా.. ‘డోప్’ సాంగ్ 4వది. ఆ పాటల్లాగే ‘డోప్’ సాంగ్‌ కూడా రికార్డులు బద్దలకొడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటల్ని అందించగా.. తిరునవుక్కరసు కెమెరామెన్‌గా పని చేశారు.

తరవాత కథనం