టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈనెల 27న హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ముందు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీ వ్యవహారంలో ఈడి మహేష్ బాబుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. దీంతో మహేష్ అభిమానులు కంగారుపడుతున్నారు. ఏమైంది ఏంటా అని గుసగుసలాడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం ఒక ప్రమోషన్ నిర్వహించాడు. దానికోసం మహేష్ 5.9 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. అందులో సగం నగదు రూపంలో తీసుకున్నాడు. మరికొంత అమౌంట్ ని ఆర్ టి జి ఎస్ రూపంలో ట్రాన్స్ఫర్ అయింది.
అయితే సాయి సూర్య డెవలపర్స్ అండ్ సురాన కంపెనీలు పెద్ద మొత్తంలో వెంచర్ల పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బులు దోచేస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను గతంలో అరెస్టు చేశారు. అంతేకాకుండా దురాన గ్రూప్ పైన కూడా కేసు నమోదు అయింది. దీంతో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసు ఆధారంగా ఈడి రంగంలోకి దిగింది. భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల మధ్య ఈడి విచారణ ప్రారంభించింది.
ఇందులో భాగంగానే ఈ నెల అంటే ఏప్రిల్ 16వ తేదీన సాయి సూర్య డెవలపర్స్ అండ్ సురన గ్రూప్లో రెండు రోజులపాటు సోదాలు నిర్వహించింది. దీంతో ఈ సోధాలు నిర్వహించినప్పుడు డబ్బులకు సంబంధించిన లావాదేవీలలో అవకతవకులు జరిగినట్టు బయటపడింది. ఈ సోదాలలో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా మహేష్ బాబుకి ఈడి నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 మూవీ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.