ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పుడు స్టార్ హీరోలందరికి ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన పూరి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నా ఒక్కటి కూడా హిట్ కావట్లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో లైగర్ మూవీ చేశాడు.
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేశాడు. ఇది కూడా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో అతడికి టాలీవుడ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోలే కరువయ్యారు. ఏ హీరో కూడా పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదు.
ఇందులో భాగంగానే దర్శకుడు పూరి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోని పట్టుకున్నాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు. అతడికి ఇటీవలే ఓ కథ చెప్పి మెప్పించాడు. దీంతో త్వరలో విజయ్ సేతుపతి అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ పెద్దపెద్ద స్టార్లను దించుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు పవర్ఫుల్ పాత్రలో నటించబోతుంది. అలాగే మరో హీరోయిన్ రాధిక ఆప్టే కూడా ఇందులో కన్ఫర్మ్ అయింది. తాజాగా ఈ మూవీలో విలన్ కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకోసం ఆ పాత్రలో సాలిడ్ యాక్టర్ ను తీసుకున్నట్లు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప మూవీలో షికావత్ పాత్రలో దుమ్ము దులిపేసిన ఫహద్ ఫాజిల్ ఇప్పుడు ఈ మూవీలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు పూరి అతడికి స్టోరీ చెప్పగా.. అది నచ్చినా.. వేరే సినిమాల తో బిజీగా ఉండడంవల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయినా దర్శకుడు మాత్రం ఫహద్ కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.