Fashion Movie Release: ఉమెన్స్‌డే స్పెషల్.. రీరిలీజ్‌కు సిద్ధమైన ‘ఫ్యాషన్’ మూవీ

Fashion Movie Release

Fashion Movie Release: భాషతో సంబంధం లేకుండా అప్లట్లో ప్రేక్షకులను అలరించింది ఫ్యాషన్ మూవీ. బాలీవుడ్‌లో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటించిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమెన్స్‌డే సందర్బంగా మార్చి 7న థియేటర్లో అలరించడానికి సిద్ధమైంది. దీంతో సినీ ప్రేక్షకులు తెగ సంబరపడుతున్నారు. బాలీవుడ్ అగ్రకథానాయికలు ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఫ్యాషన్’ మూవీ 2008లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి  రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ నటిగా ప్రియాంకా చోప్రా, ఉత్తమ సహాయ నటిగా కంగనా రనౌత్ అవార్డును అందుకున్నారు.

మేఘనామాథూర్ అనే మోడల్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. చిన్న గ్రామంలో పుట్టిన అమ్మాయి మోడల్‌గా ఎలా ఎదుగుతుంది. దాని తర్వాత ఎదుర్కున్న పరిణామాలు ఫ్యాషన్‌లో చూపించారు. ఈ సినిమాలో చాలా మంది మోడల్‌గా నటించారు. ఈ చిత్రానికి ముందు ఎన్నో అపజయాలు చవి చూసిన ప్రియాంక చోప్రాకు.. ఈ సినిమా తర్వాత తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక్కడితో ఆగకుండా ఎన్నో విజయాలను అందుకుంది.

ఫ్యాషన్ రీరిలీజ్ గురించి ప్రొడ్యూసర్ మాట్లాడుతూ.. గొప్ప కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఫ్యాషన్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీని రీరిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అప్పుడు విడుదలైన సమయంలో వచ్చిన అదరణే ఇప్పుడు వస్తుందని ఆశిస్తున్నా అని తెలిపారు. మహిళా దినోత్సవ సందర్బంగా ఫ్యాషన్ సినిమాతో పాటు క్వీన్, హైవే రీరిలీజ్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు థియోటర్లో ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి.

తరవాత కథనం