hari hara veeramallu: గెట్ రెడీ గాయ్స్.. పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీ అయ్యారు. ఆయన లైనప్ లో పలు చిత్రాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు ఒకటి. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో తొలిభాగం “హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” గా అలరించనుంది.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిoప్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్నారు.

మొదట ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అని వార్య కారణాలవల్ల ఈ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఈసారి మే 9వ తేదీన గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆ వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు.

ఈ సినిమా ఖచ్చితంగా మే 9వ తేదీన రిలీజ్ అవుతుందని మరోసారి వెల్లడించారు. ఇందులో భాగంగా ఓ అప్డేట్ అందించారు. ఈ మూవీ రీ రికార్డింగ్, వీ ఎఫ్ ఎక్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సమ్మర్లో అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందిస్తాము. మే 9వ తేదీన హరిహర వీరమల్లో సినిమా బిగ్ స్క్రీన్ లలో రిలీజ్ కాబోతోంది.

మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సంబంధించిన కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

తరవాత కథనం