Sangeetha: నటి సంగీత ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి. పెళ్లాం ఊరెళితే, బహుమతి, ఆయుదం, ఖుషీ ఖుషీగా వంటి వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సంగీత. 1997లో వెండితెరకు పరిచయమైంది. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒరియా భాషలలో 500కు పైగా చిత్రాలలో నటించింది.
కెరీర్ ప్రారంభంలోనే శివ పుత్రుడు మూవీలో చియాన్ విక్రమ్‌తో కలిసి జోడీగా నటించింది. 2002లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం మూవీ సంగీత కెరీర్ ను మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. ఇందులో సీతామహాలక్ష్మి అనే అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత అభినయం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈభామకు క్రమంగా హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తాయి.
శివపుత్రుడు, పెళ్లాం ఊరెళితె, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరి నీ ప్రేమ బంగారంగానూ, శివపుత్రుడు, నేను పెళ్లికి రెడీ, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, విజయేంద్ర వర్మ, ఖుషీఖుషీగా, సంక్రాంతి, నా ఊపిరి తదితర హిట్ సినిమాల్లో తదితర సినిమాల్లో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన సినిమా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా ఉండగానే తమిళ సింగర్ క్రిష్‌ను పెళ్లి చేసుకుంది. 2009లో తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరికి శివ్హియ అనే ముద్దుల కూతురు జన్మించింది.
ప్రస్తుతం ఓ పర్శనల్ లైఫ్ ని, మరోవైపు సినీ లైఫ్ ని బాలెన్స్ చేస్తూ.. దూసుకెళుతోంది. సంగీత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, తన భర్త, కూతురి ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
అలా తాజాగా శివ్హియ కూతురు ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా, అవి కాస్తా క్షణాల్లోనే వైరలయ్యాయి. ఇందులో శివ్హియ చాలా క్యూట్ గా ఉందంటుని, అందంలో అచ్చం అమ్మలాగే ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.