2024 లో పాన్‌ ఇండియాని రూల్ చేసిన నాలుగు సినిమాలు!

image credit: X

Pan Indian movies 2024: పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ప్రతి ఒక్క దర్శకుడు ఆ రేంజ్ లో స్టోరీస్ రాస్తుంటే..హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఈ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం టాలీవుడ్ అనే చెప్పాలి. బాహుబలి నుంచి పాన్ ఇండియా సందడి మొదలైంది. అయితే భారీ హంగులతో హడావుడి చేయకుండా మంచి కథలు తీసుకురావడంతో ఆటోమేటిగ్గా పాన్ ఇండియాలో టాలీవుడ్ వెలుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ కూడా తెలుగు ఇండస్ట్రీవైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

2024 లో పాన్ ఇండియా మార్కెట్లో టాలీవుడ్ డామినేషన్

2024లోనూ ఇండియన్ సినిమాపై తెలుగు సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపించింది. 2024లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 సినిమాల లిస్టులో నాలుగు టాలీవుడ్ మూవీసే ఉన్నాయి. వాటిల్లోనూ 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలు రెండు ఉండటం ఇంట్రెస్టింగ్. బాలీవుడ్‌ టాప్ గ్రాసర్ గా ‘పుష్ప 2’ లాంటి తెలుగు డబ్బింగ్ మూవీ నిలిచిందంటే నార్త్ లో సౌత్ ఆధిపత్యం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. RGV అన్నట్టు ఇది పాన్ ఇండియా కాదు తెలుగు ఇండియా..అంతే..

పుష్ప 2: ది రూల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ ఈ ఏడాది బాక్సాఫీస్ ను రూల్ చేసింది. ఇంకా ఈ మూవీ ర్యాంపేజ్ కొనసాగుతోంది. 11 రోజుల్లోనే 1400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి డిసెంబర్ మూడో వారం ఎండింగ్ కి 1500 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక నార్త్ సర్క్యూట్స్ లో సక్సెస్ ఫుల్ గా థర్డ్ వీక్ లో ఎంటర్ అవడమే కాదు.. హిందీలో 700 కోట్ల నెట్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఫైనల్ రన్ ముగిసే నాటికి ‘పుష్ప 2’ సినిమా ‘బాహుబలి 2’ రికార్డ్స్ ను బ్రేక్ చేసేస్తుందంటున్నారు ట్రేడ్ వర్గాలు.

కల్కి 28988 AD

ప్రభాస్ నటించిన ”కల్కి 28988 AD” ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ.. వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల వరకూ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రభాస్ తో పాటుగా అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వీళ్లందరికీ ఈ మూవీ సక్సెస్ లో భాగం ఉంది.

దేవర పార్ట్ 1

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘దేవర పార్ట్‌-1’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ డ్రామా 520 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్‌ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడింది.

హను-మాన్‌

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ‘హను-మాన్‌’ 350 కోట్లు వసూళ్లు సాధించి పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించింది. ఈ మూవీలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జా పేరు మారుమోగిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఈ మూవీ మురిపించింది. హనుమాన్ 2 గా వస్తోన్న జై హనుమాన్ పై అప్పుడే బజ్ క్రియేట్ అయ్యేంతలా సన్షేషనల్ హిట్ అందుకుంది హనుమాన్

పాన్ ఇండియా దగ్గర బోర్లా పడిన సినిమాలు

పాన్ ఇండియా రేంజ్ లో వెలుగులు మాత్రమే కాదు..అంతెత్తున ఎగురుతాయ్ అనుకుని డిజాస్టర్స్ అయిన మూవీస్ కూడా ఉన్నాయ్. వరుణ్‌ తేజ్ నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, ‘మట్కా’ , రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

2025 పాన్ ఇండియాని ఏలుతాయా?

2025లో టాలీవుడ్ నుంచి చాలా పాన్‌ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గేమ్‌ ఛేంజర్‌, తండేల్, హరి హర వీరమల్లు, ది రాజాసాబ్, మిరాయ్, ఘాటీ, కన్నప్ప, విశ్వంభర, హిట్ 3, అఖండ 2, VD 12, SYG – సంబరాల ఏటిగట్టు, OG సహా మరెన్నో..వీటిలో ఏవి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి..

తరవాత కథనం