Highest Paid Actresses: ఇండస్ట్రీలో టాప్ 10 హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

image credi:Instagram

Highest Paid Actresses:  భారతీయ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ 50,100,150,200 కోట్లవరకూ ఉంది. వీళ్లతో పోల్చుకుంటే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా చాలా తక్కువ. అందుకే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ అంటారు. ఇంతకీ టాప్ 10 హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

గడిచిన రోజులతో పోలిస్తే హీరోయిన్ల రేంజ్ పెరుగుతోంది. పెళ్లైన హీరోయిన్లను కేవలం క్యారెక్టర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ కి మాత్రమే ఫిక్స్ చేసేవారు. ఇప్పుడు రోజులు మారాయ్. పెళ్లికి – క్రేజ్ కి సంబంధం లేదు. పెళ్లైన తర్వాత కూడా స్టార్ స్టేటస్ తగ్గకుండా దూసుకెళ్తున్నారు. కెరీర్ కి పెళ్లి అడ్డంకాదని ప్రూవ్ చేశారు చాలామంది హీరోయిన్లు..అందుకే కెరీర్లో దూసుకెళ్తున్నారు. పైగా స్టార్ హీరోల‌తో పోటీప‌డుతూ రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. దీపిక ప‌దుకొనే, ప్రియాంక చోప్రా, స‌మంత‌, న‌య‌న‌తార‌, ఆలియా భ‌ట్..వీళ్లంతా కెరీర్లో బిజీగా ఉండడమే కాదు భారీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ఇక 15 కోట్లకు మించి అంత‌కుమించి పారితోషికాలు అందుకునే హీరోయిన్ల లిస్ట్ లో ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొనే, ఆలియా భ‌ట్ ఉన్నారు. ఇక న‌య‌న‌తార‌, స‌మంత‌, శ్ర‌ద్ధా క‌పూర్, కియ‌రా, పూజా హెగ్డే వీళ్లంతా 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. 2024 లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకనే హీరోయిన్ల లిస్ట్ ఇదే..

ప్రియాంక చోప్రా 15 నుంచి 30 కోట్లు తీసుకుంటోంది. బాలీవుడ్ , హాలీవుడ్ సినిమాల్లోనూ దూసుకెళ్తోంది. అప్పట్లో జంజీర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక..లేటెస్ట్ గా మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు సైన్ చేసిందని టాక్

దీపికా పదుకొనే 15 నుంచి 30 కోట్లు..వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దీపక బాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లోనూ సత్తాచాటుతోంది

ఆలియా భట్ 15 నుంచి 25 కోట్లు.. RRR తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్ సినిమాలతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ 3 లో నిలిచింది

కత్రినా కైఫ్ 12 నుంచి 15 కోట్లు..పెళ్లయ్యాక కూడా కత్రినా జోరు ఏమాత్రం తగ్గలేదు

క‌రీనా క‌పూర్ 12 కోట్లు బాలీవుడ్ బెబోగా వెలుగుతున్న కరీనా..ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్రేజ్ మరింత పెరుగుతోంది

కంగనా రనౌత్ 10 కోట్లు సినిమాల కన్నా కాంట్రవర్శీస్ తో పాపులర్ అయిన కంగనా జోరు ఎప్పుడూ తగ్గేదే లే

శ్రద్ధా కపూర్ 07 కోట్లు ఆషికి 2 మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న శ్రద్ధా కపూర్ ఓ వెలుగువెలుగుతోంది

అనుష్క శర్మ 08 కోట్లు విరాట్ తో పెళ్లి తర్వాత కెరీర్లో జోరు తగ్గినా అనుష్క శర్మ క్రేజ్ మాత్రం అలానే ఉంది

ఐశ్వర్య రాయ్ 5 – 6 కోట్లు ఐశ్వర్యారాయ్ ఈ పేరులోనే ఓ వెలుగు ఉంది.. ఆమె కెరీర్ కూడా అలానే వెలుగుతోంది

విద్యాబాలన్ 4 కోట్లు విభిన్న కథనాలు సెలెక్ట్ చేసుకుని కెరీర్లో దూసుకెళ్లే విద్యా బాలన్ ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్

కియారా అద్వానీ 3 -5 కోట్లు హిందీ, తెలుగు సినిమాల్లో ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది కియారా

దిశా పటానీ 6 -10 కోట్లు.. హాట్ హీరోయిన్ల లిస్ట్ లో ఫస్ట్ ఉంటుంది దిశా.. హిట్స్ ఉన్నా లేకున్నా ఫుల్ క్రేజ్ ఉంది

న‌య‌న‌తార 6- 10కోట్లు – లేడీ అమితాబ్ గా నయన్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది కానీ తగ్గలేదు..

స‌మంత‌- 4 కోట్లు – స్టార్ హీరోయిన్ గా వెలిగిన సమంత ఫాలోయింగ్ ఇప్పటికీ అలానే ఉంది

పూజా హెగ్డే- 4 కోట్లు సౌత్, నార్త్ మూవీస్ లో ఓ వెలుగు వెలిగి చిన్న బ్రేక్ తీసుకున్న పూజా మళ్లీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది

కాజోల్ 3 – 4 కోట్లు , కృతి సనన్ 4 – 8 కోట్లు, మాధురీ దీక్షిత్ 3 – 5 కోట్లు…ఇంకా ఈ లిస్టులో చాలామంది ఉన్నారు.. గత రోజులుతో పోల్చుకుంటే ప్రస్తుతం హీరోయిన్ల క్రేజ్ బాగానే ఉందని చెప్పుకోవాలి

తరవాత కథనం