బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అతడికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హృతిక్ సినిమా వస్తుందంటే అభిమానులు థియేటర్లకు పరుగులు పెడతారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ “వార్ 2” సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆడియన్స్ను అలరించేందుకు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
క్రిష్ మూవీ ఫ్రాంచైజీ నుంచి “క్రిష్ 4” చిత్రం ప్రకటించారు. ఇప్పటికే క్రిష్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 వంటి చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2013లో విడుదలైన క్రిష్ 3 మంచి రెస్పాన్స్ అందుకుంది. ఒక వైరస్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలని విలన్స్ ప్లాన్ చేయగా.. దానిని క్రిష్ అతడి తండ్రి ఎలా అడ్డుకున్నారు అనేది చూపించారు.
అప్పట్లో ఈ చిత్రం రూ.393 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా క్రిస్ 4 రాబోతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ క్రిష్ 4 చిత్రానికి హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని యస్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విడుదల కానున్నాయి