Hyderabad: నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధులపై దాడి చేసిన ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. దీంతో విచారణకు సిద్ధమైన పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మంచు ఫ్యామిలీలో ఏర్పడ్డ విభేదాలు కారణంగా హైదరాబాద్‌లో జల్‌పల్లిలో గత ఆదివారం నుంచి హైడ్రామా నడిచింది. మోహన్ బాబు ఇంటికి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించడం అక్కడ ఘర్షణ జరిగింది. దీన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై సీనియర్ నటుడు దాడి చేశారు. మోహన్ బాబు దాడిలో మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కూడా చేశార.
మోహన్ చేసిన దాడిని మొదట నార్మల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత సెక్షన్‌లు మార్చారు. హత్యాయత్నం కింద మార్చారు. దీంతో ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
నాలుగు రోజుల నుంచి విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ వివిధ కారణాలతో మోహన్ బాబు తప్పించుకుంటున్నారు. ఘటన జరిగిన తర్వాత రోజు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేరారు. విడుదలైన తర్వాత కూడా కోర్టు ఆదేశాల మేరకు విచారించడానికి కుదర్లేదు. చివరకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విచారించేందుకు వెళ్తే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి చెబుతున్నారు.