Jaat Trailer: తెలుగు డైరెక్టర్, హిందీ యాక్టర్.. ‘జాట్’ ట్రైలర్ గూస్ బంప్స్..

గతకొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక్క సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో సైతం తెలుగు సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. హిందీ సినిమాలు ఓపెనింగ్స్ రాబట్టడానికి అష్టకష్టాలు పడుతుంటే.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం కళ్లు చెదిరే కక్షన్లతో అదరగొట్టేస్తున్నాయి. దీనిబట్టి చూస్తే తెలుగు సినిమాల ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందువల్లనే బాలీవుడ్ స్టార్ హీరోలు ఏరికోరి మరీ సౌత్ డైరెక్టర్లతో సినిమా చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికిందర్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది.

అలాగే ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ సౌత్ డైరెక్టర్‌తో జోడీ కట్టాడు. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ‘జాట్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో రెజీనా కాసాండ్రా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినీత్‌ కుమార్‌ సింగ్‌, రణదీప్‌ హుడా, జగపతిబాబు, రమ్యకృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో పవర్ ఫుల్ డైలాగ్స్ అబ్బురపరిచాయి. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు దుమ్ము దులిపేశాయి. కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాగా దర్శకుడు గోపీచంద్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘జాట్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ అక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి.

తరవాత కథనం