Dilruba Movie Review: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా?

Dilruba Movie Review

Dilruba Movie Review:: ‘క’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్‌ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘దిల్ రూబా’ అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దీంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.

కథ : సిద్ధు అలియాస్ సిద్దార్థ్ రెడ్డిది(కిరణ్ అబ్బవరం) ఉడుకురక్తం. ఇతని దృష్టిలో సారీ, థాంక్స్ అనే పదాలకి చాలా విలువ ఉంది అని చెబుతుంటాడు. వాటిని వాడే సందర్భానికి కూడా గౌరవం ఉండాలనేది అతని తపన. వీటి వల్ల వచ్చే కాన్ఫిక్స్‌లో భాగంగా అతని మాజీ ప్రేయసి మ్యాగీ ( దేవిసన్) ను దూరం చేసుకుంటాడు. తర్వాత ఇతని లైఫ్ లోకి అంజలి (రుక్సర్ థిల్లాన్) అనే మరో అమ్మాయి వస్తుంది. ఈమెతో కూడా సిద్ధుకి చాలా వరకు అలాంటి సమస్యలే వచ్చి పడతాయి. దీంతో అతని మాజీ ప్రేయసి సాయం కోరతాడు. ఆమె ఇతని లవ్ లైఫ్‌లో వచ్చిన సమస్యలు తీర్చుకోవడానికి ఎలా సాయపడింది. మరోపక్క విక్కీ అనే వ్యక్తి సిద్ధుని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటాడు? అలాగే జోకర్ (జాన్ విజయ్) పాత్ర ఏమిటి? అసలు మ్యాగీతో సిద్ధు ఎందుకు విడిపోయాడు? అలాగే అంజలి, సిద్ధుల ప్రేమ గెలిచిందా? లేదా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ : ‘దిల్ రూబా’ లో పెద్దగా కథ ఏమీ ఉండదు అని ఈ పాటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఒక సాదా సీదా పాయింట్‌ని 2 గంటల 32 నిమిషాలు చెప్పాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వ కరుణ్. ఈ క్రమంలో యూత్‌కి నచ్చే కొన్ని డైలాగులు, రొమాంటిక్ సీన్స్ బాగానే డిజైన్ చేసుకున్నాడు. కానీ హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో తేడా కొట్టేసింది. ఓ స్టార్ హీరోకి పెట్టినట్టు ఇష్టమొచ్చినట్టు ఫైట్లు వంటివి పెట్టేశాడు. అవి ఎలివేషన్స్ అని అనుకోమన్నట్టు ఉంటాయి. కానీ కథ ఏంటో సరిగ్గా ఓ ఐడియా రాకుండా ఇలాంటి పైపై మెరుపులతో ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవ్వగలరు.. ఎంతవరకు టైం పాస్ అనుకోగలరు.

ఎక్కడా కూడా సినిమా వేగం పుంజుకోదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాతల్లో ఒకరైన రవి చెప్పినట్టు ఫైట్స్ విషయంలో బాగా శ్రద్ద పెట్టినట్టు ఉన్నారు. ఒకటి, రెండు ఫైట్లు బాగున్నాయి. కానీ వాటికి కిరణ్ కటౌట్ ఎందుకో సరిపోలేదేమో అనిపిస్తుంది. సామ్‌సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ సినిమాలకి మాత్రమే సెట్ అవుతుందని మరోమారు ప్రూవ్ చేసిన సినిమా దిల్ రూబా. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం గత సినిమాలతో పోలిస్తే హ్యాండ్సమ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించాడు. కానీ డైలాగ్స్ వద్ద కిరణ్ దొరికిపోతూ ఉంటాడు. అతను లౌడ్‌గా డైలాగ్స్ చెబుతున్న టైంలో ఎంత ఇబ్బంది పడతాడో అందరికీ క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. దిల్ రూబా విషయంలో కూడా అదే జరిగింది. హీరోయిన్లు రుక్సర్ ఎప్పటిలానే గ్లామర్‌గా కనిపించింది. మరో హీరోయిన్ కథి దేవిసన్ హీరో కిరణ్ కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలా కనిపించింది. ఆమె గ్లామర్ అంతగా ఆకట్టుకోదు. జాన్ విజయ్ బాగానే చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ

డైలాగ్స్

2 ఫైట్లు

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్

సాగదీత

మొత్తంగా ఈ ‘దిల్ రూబా’ .. సమీక్ష సమీక్షకుడికి దృష్టి కోణాన్ని సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అబి ప్రాయం

తరవాత కథనం