Surya : ‘రెట్రో’ నుంచి మరో సాంగ్.. అదిరిపోయింది బాసూ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది కంగువ మూవీతో వచ్చాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో సూర్య విలక్షణమైన పాత్రలో నటించి అదరగొట్టేసాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మారింది. కోట్లతో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. దీంతో సూర్య తన నెక్స్ట్ సినిమాను ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

ఇందులో భాగంగానే ఇటీవల ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రో మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు మరికొందరు స్టార్ నటీనటులు ఇందులో భాగమయ్యారు. జయరాం, జూజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాసర్, విద్యాశంకర్, కరుణాకరన్ వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇందులో మరో హీరోయిన్ శ్రియ శరన్ స్పెషల్ సాంగ్ తో చిందేయనుంది. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ అండ్ 2D ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సాంగ్స్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ కనిమ ‘అనే సాంగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్లో సూర్య, పూజ హెగ్డే డ్యాన్స్ తో కుమ్మేసారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం మే1న రిలీజ్ కానుంది.

తరవాత కథనం