నాచురల్ స్టార్ నాని హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం “ఈగ”. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఒక ఈగతో కూడా సినిమా తీయొచ్చు అనేంతలా రాజమౌళి పేరు మారుమోగిపోయింది. గతంలో ఈ సినిమా ఓ రేంజ్ లో సినీ ప్రియుల్ ని ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత సీక్వెల్ ప్లాన్ చేయాలని ఎంతోమంది అభిమానులు రాజమౌళి అని కోరారు. కానీ ఆయన ఎప్పుడు దీనిపై స్పందించలేదు. ఆ తర్వాత బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పుడు ఈగ మూవీ తరహాలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా పేరు లవ్లీ. అయితే ఇది తమిళ్ సినిమా కాగా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. దినేష్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాథివ్ థామస్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు.
ఆ టీజర్ బట్టి.. ఇందులో ఈగకు ఓ యువకుడికి మధ్య స్నేహాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అచ్చం రాజమౌళి ఈగ సినిమా వలె గ్రాఫిక్స్ ఉండడంతో టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.