Hari Hara Veera Mallu: లేటెస్.. హరి హరవీర మల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసింది..

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్, సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగరవ్వాల్ హీరోయిన్‌‌గా, డైరక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కుతున్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని సక్రమంగా ఉన్నట్లైతే ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు రాలేదు. ఇటీవల మార్చి28న విడుదల కానుంది అంటూ సినిమా బృదం అనౌన్స్ చేశారు.. కానీ ఇప్పుడు మళ్లీ వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు విడుదల తేదీనీ చిత్ర బృందం ప్రకటించింది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో టీమ్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలిపింది.

17వ శతాబ్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, ఫక్రీ, నోరా ఫతేహి కీలకపాత్రలో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతీ కృష్ణ దర్శకులు, మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.

తరవాత కథనం