Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్తా: లావణ్య

రాజ్ తరుణ్ – లావణ్యల వ్యవహారం గతేడాది ఎలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాను తలపించే రేంజ్ లో.. ట్విస్టుల మీద ట్విస్టులతో వీరిద్దరి వ్యవహారం కొనసాగింది. రాజ్ తరుణ్ తనును మోసం చేశాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను అన్ని విధాల వాడుకున్నాడని లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. అతన్ని అస్సలు వదలనని.. న్యాయం జరిగే వరకు పోరాడతానని అప్పట్లో రచ్చ రచ్చ చేసింది.

తన వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడని.. ఇప్పుడు వేరే అమ్మాయి మోజులో పడి తనను వదిలించుకున్నాడు అంటూ గతంలో లావణ్య చేసిన రచ్చ అంత ఎంత కాదు. అయితే లావణ్య ఇప్పుడు మరో వ్యక్తిపై ఆరోపణలు చేసింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయి వద్ద హార్డ్ డిస్క్ లో 300 ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయని తెలిపింది. ఇక ఎలగోల ఆ హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి నుంచి కొట్టేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు అప్పగించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. ఇలా గత ఏడాది రాజ్ తరుణ్, ఈ ఏడాది మస్తాన్ సాయి.. ఇద్దరితోనూ ఆట ఆడేసుకుంది. మరి ఇంత చేసిన లావణ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ కు సారీ చెప్పింది. అతడు పక్కనుంటే కాళ్లు పట్టుకొని మరి క్షమాపణ చెప్తాను అని చెప్పడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.

తాజాగామే ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన మనిషి తనకు దూరమైపోతున్నాడన్న బాధతోనే రాజ్ పై పోలీస్ కేసు పెట్టానని లావణ్య తెలిపింది. తనను డ్రగ్స్ కేసులో ఇరికించింది రాజ్ తరుణ అని మస్తాన్ సాయి చెప్పిన మాటలు వినీ నమ్మేసానని చెప్పుకొచ్చింది. అందువల్లనే ఈ విషయంలో రాజ్ తరుణ్ కి సారీ చెప్పాలనుకుంటున్నానంది. అతడు ఇక్కడే ఉంటే కాళ్లు పట్టుకొని మరీ క్షమాపణలు అడిగేదాన్ని పేర్కొంది.

తరవాత కథనం