అల్లు అర్జున్ to రాజ్ తరుణ్.. 2024 లో కేసులలో చిక్కుకున్న టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు వీళ్ళే!

Image credit: Instagram

 Telugu Celebrities who Faced Police Cases in 2024: కొన్ని రోజుల్లో 2025 వచ్చేస్తోంది. 2024లో జరిగిన మొత్తం వివరాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మరి పాత ఏడాదిలో కేసులు, కోర్టులు, జైలు వరకూ వెళ్లొచ్చిన సెలబ్రెటీలు ఎవరో చూద్దాం..

అల్లు అర్జున్ (Allu Arjun)

డిసెంబరు 13 మధ్యాహ్నం… హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ టాలీవుడ్ లో సంచలనం రేపింది. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను  శుక్రవారం అరెస్టు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. అరెస్ట్ కావడం..కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 ఇయర్ ఎండ్ పుష్ప 2 మూవీ ఇచ్చిన బిగ్గెస్ట్ హిట్ జోష్ లో ఉన్న బన్నీకి..ఊహించని అరెస్ట్ షాక్ అనే చెప్పాలి.

మోహన్ బాబు (Mohan Babu)

2024 ఇయర్ ఎండ్ మంచువారి కుటుంబంలో ముసలం పుట్టింది. కుటుంబంలో ఆస్తుల గొడవ సందర్భంగా మంచు కుటుంబం రోడ్డెక్కింది. ఈ వ్యవహారంలో మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రశ్నించిన మీడియా సభ్యులపై మోహన్ బాబు దాడిచేయడంతో కేసు నమోదైంది.

రాజ్ తరుణ్ (Raj Tarun)

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ ఏడాది మొదట్లో లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని వైరల్ అయ్యాడు. రాజ్ తరుణ్ తనను లైంగికంగా వాడుకుని పెళ్లి చేసుకోవడం లేదని లావణ్య అనే యువతి ఆరోపణలు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్లుగా తాము డేటింగ్ చేస్తున్నామని ఈ మధ్య వేరే నటితో సంబంధం పెట్టుకుని తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది.

జానీ మాస్టర్ (Jani Master)

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రీసెంట్ గా జైలు నుంచి విడుదలయ్యాడు. తన వద్ద పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే కేసులో జైలుకెళ్లాడు జానీ మాస్టర్. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సదరు యువతి నేరుగా ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు.

రామ్ గోపాల్ వర్మ (RGV)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా 2024 లో కేసుల్లో చిక్కుకున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులొచ్చాయి. టీటీడీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.

తరవాత కథనం