మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోసలే తన అందమైన నీలి కళ్ళతో ప్రజలను అట్రాక్ట్ చేసింది. ప్రయాగ్‌రాజ్ మహాకుంమేళాతో ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె త్వరలో సినిమాల్లోకి అడుగు పెట్టబోతోంది. దర్శకుడు సనోజ్ మిశ్రా రాబోయే చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసాకు ప్రధాన పాత్ర కల్పించారు.
మోనాలిసా ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో సినీ ప్రియులు ఆమె యాక్టింగ్ చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన 5 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇందులో యూట్యూబ్ ఛానల్ యజమాని పేరు కూడా ఉంది. ఈ వ్యక్తులు తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు, తన సినిమాను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని మిశ్రా ఆరోపించారు. ఈ సినిమాను ఆపేయాలని కొంతమంది ఈ సినిమా నిర్మించకముందే వివాదాల్లోకి లాగుతున్నారని ఆయన అన్నారు.
5 మందిపై ఫిర్యాదు నమోదు
ముంబైలోని అంధేరిలో ఉన్న అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఆయన ఈ కేసును నమోదు చేశారు. ఇక సనోజ్ మిశ్రా ఫిర్యాదులో.. ఇప్పటి వరకు తన సినిమాలు విడుదల కాలేదని, మోనాలిసా కెరీర్‌కు హాని చేస్తానని బెదిరించారని ఆయన ఆరోపించారు. దీంతో ఒక యూట్యూబర్‌తో పాటు మరో నాలుగురు వ్యక్తులపై ఆయన కంప్లైంట్ చేశారు.
సనోజ్ మిశ్రా తీవ్ర ఆరోపణలు
ఈ ఆరోపణలన్నింటినీ సనోజ్ మిశ్రా ఖండించారు. ఈ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాను ఆపడానికి బాగా ప్లాన్ చేసిన కుట్ర అని అతను ఆరోపించాడు. ఈ కేసులో అంబోలి పోలీసులు భారత శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.