Dhee Movie Re Release: కన్నప్ప కన్నా ముందే రీ రిలీజ్‌కు వస్తున్న మంచు విష్ణు మూవీ ‘ఢీ’..

Dhee Movie Re Release: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ అయి సినీ ప్రేక్షకులను పలకరించింది. ఇక తాజాగా మంచు విష్ణు హీరోగా, జెనీలియా కథానాయికగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఢీ’ కూడా మళ్లీ విడుదలకు సిద్ధమైంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చి యాక్షన్ కామెడీ చిత్రం.. ఈ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, శ్రీహరి కీలక పాత్రలో నటించారు.

2007లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని.. వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాదు మంచు విష్ణు కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా మార్చి 28న రీ రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించనుంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. హుర్రే అంటూ విష్ణు పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫన్నీ అండ్ ఎంటర్ టైనింగ్..

శ్రీనివాస్ అనే యువకుడు అలియాస్ బబ్లూ(విష్ణు) అల్లరి చిల్లరిగా ఉండేవాడు. ఇతడి పనుల వల్ల తండ్రి నారాయణ(చంద్రమోహన్) తరుచూ ఇబ్బందులు పడుతుంటారు. దీంతో లోకల్ దాదా అయిన శంకర్ గౌడ్(శ్రీహరి) దగ్గర పనిలో పెడతాడు. ఈ నేపథ్యంలో శంకర్ చెల్లెలు పూజా(జెనీలియా)తో ప్రేమలో పడతాడు.

వీరి ప్రేమ వ్యవహారం శంకర్ తెలియకుండా ఎలా మానేజ్ చేశారు..? భల్లు (సుప్రీత్) కిడ్నాప్ చేసిన పూజను బబ్లూ ఎలా విడిపించాడు..? అన్నది ఈ మూవీ కథ. మరీ ముఖ్యంగా శంకర్ ఇంట్లో బబ్లూ, బ్రహ్మానందం, సునీలు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమాకి చక్రి సంగీతం అందించారు.

తరవాత కథనం