ఇప్పుడు అందరి చూపు టాలీవుడ్ లోని భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప మూవీ పై ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అతడి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతోంది. ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ భాగమైంది.
ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు వంటి సీనియర్ అండ్ యంగ్ హీరోలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇటీవల ఓ లవ్ సాంగ్ రిలీజ్ అవ్వగా.. అందర్నీ బాగా అలరించింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇందులో భాగంగానే మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ మంచు విష్ణు సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు. మరోవైపు సినిమాకు సంబంధించిన అప్డేట్‌లు రిలీజ్ చేస్తూ అభిమానుల్ని, సినీ ప్రియులని ఆకట్టుకుంటున్నారు. ఈ తరుణంలో మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా మరో సర్ప్రైజ్ అందించారు.
కన్నప్ప మూవీ లో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నాడు. దీంతో బర్తడే రోజున అతడి పాత్రకు సంబంధించిన ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ లో కనిపించారు. డమ డమ డమడమ విస్పులింగ దిమిదిమి దిమి దిమి ఆత్మలింగ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ ను దాదాపు 5 భాషల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ గ్లింప్స్ చూసి ఎంజాయ్ చేయండి.